OTT Movie: 2 గంటల 16 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్.. ‘దృశ్యం’ సినిమాను తలపించే ట్విస్టులు.. తెలుగులోనూ ఉంది

ఇప్పుడు సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాల పట్ల విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఓటీటీలో ఈ జానర్ సినిమాలకు ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు అలాంటి ఒక చిత్రం సస్పెన్స్, పవర్‌ఫుల్ క్లైమాక్స్ విషయంలో 'దృశ్యం'కి గట్టి పోటీ ఇస్తోంది. ఈ చిత్రానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో రికార్డు వ్యూయర్ షిప్ వచ్చింది.

OTT Movie: 2 గంటల 16 నిమిషాల సస్పెన్స్ థ్రిల్లర్.. దృశ్యం సినిమాను తలపించే ట్విస్టులు.. తెలుగులోనూ ఉంది
OTT Movie

Updated on: Jun 25, 2026 | 9:16 AM

చాలా మంది వీక్షకులకు సస్పెన్స్-థ్రిల్లర్ అత్యంత ఇష్టమైన జానర్. OTT ప్లాట్‌ఫారమ్‌ల పుణ్యమా అని, ప్రేక్షకులు ఇప్పుడు తమకు ఇష్టమైన జానర్‌కు చెందిన సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లను ఎప్పుడైనా చూడవచ్చు. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి.
అలా ఐదు సంవత్సరాల క్రితం విడుదలైన ఓ సినిమా ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు వ్యూస్ తెచ్చుకుంది.
ఈ సినిమాలోని ట్విస్టులు, మరీ ముఖ్యంగా క్లైమాక్స్ అయితే ఎవరూ ఊహించలేరు. దృశ్యం, మహారాజా సినిమాలను మించి ఇందులో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. తన భర్తను చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రాణి అనే పాత్రతో ఈ సినిమా కథ మొదలవుతుంది. ఇంట్లో జరిగిన ఒక ప్రమాదంలో రాణి భర్త కాలి బూడిదైపోతాడు. కానీ పోలీసులకు అతని శరీరం దొరకదు. వారికి కేవలం ఒక చేయి మాత్రమే దొరుకుతుంది. ఢిల్లీకి చెందిన రాణి ఒక చిన్న పట్టణానికి చెందిన ఇంజనీర్‌ను వివాహం చేసుకుంటుంది. అయితే, వారి వైవాహిక జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయి.

రాణి భర్త బంధువైన నీల్, తరచుగా ఆమె ఇంటికి వస్తుంటాడు. వారిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడి, ప్రేమలో పడతారు. ఇంతలోనే రాణి డైరీ పోలీసులకు దొరుకుతుంది. రాణి భర్త హత్యలో నీల్‌కు కూడా ప్రమేయం ఉందని వారు నమ్మేలా చేస్తుంది. అయితే, కథ ముందుకు సాగేకొద్దీ, సంచలన నిజాలు వెలుగులోకి వస్తాయి. ఈ సినిమా క్లైమాక్స్ అయితే వేరే లేవెల్. సినిమా చూస్తున్నంత సేపు మీరు ఒక్క నిమిషం కూడా మీ సీటులోంచి లేవాలని అనుకోరు.

ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా పేరు ‘హసీన్ దిల్‌రూబా’. ఇందులో తాప్సీ పన్ను రాణి పాత్రను పోషిస్తోంది. తాప్సీతో పాటు, విక్రాంత్ మాస్సే హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. కాగా ఈ సినిమాకు సీక్వెల్ కూడా వచ్చింది. అయితే మొదటి పార్ట్ విజయం సాధించినట్లు రెండో భాగం పెద్దగా ఆడియెన్స్ ను మెప్పించలేకపోయింది. కానీ సీక్వెల్ లోనూ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు కూడా బాగానే ఉన్నాయని రివ్యూలు వచ్చాయి. మరి ఈ సినిమాలను మిస్ అయ్యారా? అయితే ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Follow Us