Cinema : శవం చుట్టూ అమ్మాయి మిస్టరీ.. ఓటీటీలో రచ్చ రచ్చ చేస్తున్న క్రేజీ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్!

కరణ్ జోహార్ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' ఫ్రాంచైజీ ఈసారి మర్డర్ మిస్టరీగా వచ్చింది. షనాయా కపూర్ ద్విపాత్రాభినయం చేసిన 'ఆఫ్టర్ డార్క్' జియోహాట్‌స్టార్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఆరు ఎపిసోడ్ల ఈ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ సిరీస్ గురించి ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిందే.

Cinema : శవం చుట్టూ అమ్మాయి మిస్టరీ.. ఓటీటీలో రచ్చ రచ్చ చేస్తున్న క్రేజీ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్!
Student Of The Year After Dark

Updated on: Nov 14, 2026 | 7:28 AM

బాలీవుడ్‌లో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్న ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ ఫ్రాంచైజీ నుంచి పూర్తిగా భిన్నమైన జోనర్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటివరకు కాలేజ్ రొమాన్స్, ఫ్రెండ్‌షిప్, డ్యాన్స్‌లు, గ్లామర్‌తో సాగిన ఈ ఫ్రాంచైజీని మేకర్స్ ఈసారి పూర్తిగా డార్క్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా మలిచారు. అదే ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్’ (Student of the Year: After Dark) వెబ్ సిరీస్. ఈ హిందీ వెబ్‌సిరీస్ నవంబర్ 13 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో షనాయా కపూర్ ద్విపాత్రాభినయం చేశారు. ఇది ఆమెకు ఓటీటీ అరంగేట్రం. కేవలం హిందీలోనే కాకుండా తెలుగుతో పాటు పలు ప్రధాన భాషల్లో ఇది అందుబాటులోకి రావడం విశేషం.

ఈ సిరీస్ కథాంశం విషయానికి వస్తే, ప్రతిష్టాత్మకమైన సెయింట్ థెరిసా హెరిటేజ్ స్కూల్‌లో పాపులర్ స్టూడెంట్ అయిన అయేషా మాలిక్ (షనాయా కపూర్) అనుమానాస్పద రీతిలో గడ్డకట్టిన బరాఖలి సరస్సులో శవమై కనిపిస్తుంది. ఆమె మరణం పైకి ప్రమాదంలా అనిపించినా, ఆమె కవల సోదరి అదితి (షనాయా కపూర్ ద్విపాత్రాభినయం) మాత్రం దీన్ని హత్యగా భావిస్తుంది. తన అక్క మరణం వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి, అసలు నిజాలు నిగ్గుతేల్చడానికి అదితి అదే స్కూల్‌లో విద్యార్థినిగా చేరుతుంది. అక్కడికి వెళ్లాక స్కూల్‌లో ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ పేరుతో ఒక రహస్యమైన పోటీ జరుగుతున్నట్లు ఆమె తెలుసుకుంటుంది. ఈ పోటీలో గెలిచిన వారికి తమ భవిష్యత్తు కోసం అద్భుతమైన అవకాశాలు లభిస్తాయని విద్యార్థులు తీవ్రంగా విశ్వసిస్తుంటారు. అయితే అయేషా మరణానికి, ఈ రహస్య పోటీకి మధ్య బలమైన సంబంధం ఉందని గ్రహించిన అదితి కూడా ఆ పోటీలో పాల్గొంటుంది. ఒకవైపు పోటీలో గెలవడానికి ప్రయత్నిస్తూనే, మరోవైపు తన అక్క మిత్రులు, క్లాస్‌మేట్స్‌ను విచారిస్తూ లోతైన ఆధారాలు సేకరించడం ప్రారంభిస్తుంది.

ఈ విచారణలో విద్యార్థుల మధ్య ఉన్న ఈర్ష్యలు, ప్లాన్‌లు, వారు దాచిపెట్టిన చీకటి రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ప్రతి ఒక్కరిపై అనుమానం కలిగేలా దర్శకురాలు రీమా మాయా ఈ కథనాన్ని అత్యంత ఉత్కంఠభరితంగా మలిచారు. షనాయా కపూర్ నటన ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవగా, ఆమెతో పాటు దివిక్ శర్మ, అభినవ్ సింగ్, మాన్యా గ్రోవర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, అపూర్వ మెహతా, అదార్ పూనావాలా సంయుక్తంగా ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు. మొత్తం 6 ఎపిసోడ్లతో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ సస్పెన్స్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us