
ఓటీటీలో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఉండే ఆదరణే వేరు. ఈ జానర్లకు చెందిన సినిమాలు ఇతర భాషల్లో ఉన్నా సబ్ టైటిల్స్ తో చూసి ఆనందిస్తుంటారు ఓటీటీ ఆడియెన్స్. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో హరర్, సస్పెన్స్ థ్రిల్లర్, మిస్టరీ చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇటీవల అడియన్స్ కూడా ఇదే తరహా కంటెంట్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే అటు సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు ఎక్కువగా హరర్ కామెడీ చిత్రాలను తీసుకువస్తున్నారు మేకర్స్. ఇతర భాషలలో సూపర్ హిట్ అయిన చిత్రాలను కూడా తెలుగులోకి డబ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు హారర్ ఓ వెబ్ సిరీస్ ఓటీటీని వణికించేస్తోంది. ఓ భాషలో రిలీజ్ అయిన వెబ్ సిరీస్ ను టాలీవుడ్, కోలీవుడ్ అనే భేదాలు లేకుండా అన్ని భాషలకు చెందిన అడియన్స్ చూస్తున్నారు. ఇప్పుడు ఆ సిరీస్ ఓటీటీలో కాకుండా యూట్యూబ్ లో ఫ్రీగా చూడొచ్చు. అదే కరువనమ్.
తమిళంలో రూపొందించిన హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇప్పుడు నేరుగా యూట్యూబ్ లో రిలీజ్ అయ్యింది. మొత్తం మూడు ఎపిసోడ్స్ ఉన్న సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పుడు యూట్యూబ్ లో ఈ వెబ్ సిరీస్ ట్రెండింగ్ లో ఉంది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఈ సిరీస్ అందుబాటులోకి తీసుకువచ్చారు మేకర్స్. ఇందులో ఉదయ సుందరి, జయ శ్రీ విజయన్, విఘ్నేష్ వరదరాజన్, వీరరాఘవన్ ప్రధాన పాత్రలు పోషించారు. కుమరన్ సుందరన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఆద్యతం ఊహించని ట్విస్టులు.. వణుకుపుట్టించే సీన్లతో ఆకట్టుకుంటుంది. కథ విషయానికి వస్తే..
మీరా, షాలిని అనే ఇద్దరు అనాథలు ఓ ఆశ్రమంలో పెరుగుతుంటారు. వారిద్దరిని ఓ గొప్పింటి మహిళ దత్తత తీసుకుంటుంది. తల్లి మరణించడంతో ఆమె ఇంట్లో కొన్నాళ్లపాటు గడపాల్సి వస్తుంది. ఆ ఇంట్లో వారికి ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి.? అసలు వారిద్దరి తల్లి ఎలా చనిపోయింది.. అన్నదే అసలు కథ. ఈ సిరీస్ ఇంట్రెస్టింగ్ ట్విస్టులు, వణుకించే సీన్లతో ఆకట్టుకుంటుందని ఇప్పటికే రివ్యూస్ వచ్చాయి. ఈ సిరీస్ మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హారర వెబ్ సిరీస్ ను అస్సలు మిస్ అవ్వకండి. ప్రతి సీన్ సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.