
సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఇంటర్నేషనల్ రొమాంటిక్ డ్రామా మూవీ ‘గర్ల్స్ లైక్ గర్ల్స్’ (Girls Like Girls) డిజిటల్ ప్రియులను అలరించేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది. అమెరికన్ కమింగ్ ఆఫ్ ఏజ్ రొమాంటిక్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం నేరుగా ప్రేక్షకుల ఇళ్లల్లోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రముఖ హాలీవుడ్ సింగర్, డైరెక్టర్ హేలీ కియోకో (Hayley Kiyoko) రాసిన ప్రముఖ నవల ఆధారంగా తెరకెక్కింది. అంతకుముందు ఆమె పాడిన ‘గర్ల్స్ లైక్ గర్ల్స్’ మ్యూజిక్ ఆల్బమ్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. ఇద్దరు అమ్మాయిల మధ్య చిగురించిన ప్రేమ, వారి స్నేహం, ఆ తర్వాత సమాజం నుండి , వారి వ్యక్తిగత జీవితాల్లో ఎదురైన ఎమోషనల్ ట్విస్ట్‌ల చుట్టూ ఈ లవ్ స్టోరీ తిరుగుతుంది. మాయా డి కోస్టా, మైరా మాలోయ్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించి తమ నటనతో ఆకట్టుకున్నారు. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ జూన్ 19న అంతర్జాతీయంగా థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కాగా, తాజాగా ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో రెంటల్ (Rental) విధానంలో వీక్షించవచ్చు.
ఇంగ్లీష్ భాషతో పాటు భారతదేశంలోని ఓటీటీ వీక్షకుల కోసం తెలుగు, హిందీ, తమిళం భాషల్లో కూడా దీనిని డబ్బింగ్ చేసి అందుబాటులోకి తెచ్చారు. విభిన్నమైన ప్రేమకథలను, ఎమోషనల్ డ్రామాలను ఇష్టపడే సినీ ప్రియులకు ఈ వారం ఓటీటీలో ఇదొక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. డిఫరెంట్ కంటెంట్ ఇష్టపడే తెలుగు ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.
ఎక్కువ మంది చదివినవి : Aamir Khan: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి.. ఆమీర్ ఖాన్ తన మొదటి ఇద్దరు భార్యలకు ఎందుకు విడాకులు ఇచ్చారో తెలుసా.. ?
కథ విషయానికి వస్తే.. ఇది ఒక హార్ట్-టచింగ్ కమింగ్-ఆఫ్-ఏజ్ (Coming-of-age) లవ్ స్టోరీ. ‘కోలీ’ (మాయా డా కోస్టా) అనే ఒక యువతి తన తండ్రితో కలిసి ఉండటానికి ఒరెగాన్‌లోని ఒక చిన్న టౌన్‌కు వస్తుంది. అక్కడ ఆమెకు స్థానికంగా ఉండే ‘సోన్యా’ (మైరా మొల్లోయ్) అనే అమ్మాయి పరిచయమవుతుంది. మొదట వీరిద్దరి మధ్య స్నేహం మొదలైనప్పటికీ, అది క్రమంగా ప్రేమగా మారుతుంది. అయితే, సమాజం , తమ చుట్టూ ఉన్న పరిస్థితుల మధ్య తమ ప్రేమను ఎలా నిలబెట్టుకున్నారు, కోలీ తన సొంత గుర్తింపును (Identity) ఎలా అంగీకరించింది అనేదే ఈ సినిమా ముఖ్య కథాంశం.
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: అన్నయ్య నాకోసం ఫ్యాన్స్ వస్తారా అని అడిగాడు.. ఇప్పుడు ఇండస్ట్రీకే మొగుడయ్యాడు.. మురళి మోహన్..
ఎక్కువ మంది చదివినవి : Cinema: ఫస్ట్ సినిమా చూసి ప్లాప్ అన్నారు.. కట్ చేస్తే.. 26 ఏళ్లుగా తగ్గని క్రేజ్.. ఇప్పటికీ టీవీలకు అతుక్కుపోతారు..