
థియేటర్లలో ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. అందులోనూ సీనియర్ హీరో, హీరోయిన్లు. దీంతో చాలా మంది ఈ సినిమాను లైట్ గా తీసుకున్నారు. అయితే ఒక్కోసారి చిన్న సినిమాలు కూడా సంచలనాలు నమోదు చేయవచ్చని ఈ మూవీ నిరూపించింది. కేవలం మౌత్ టాక్ తోనే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. రూ. 15 కోట్లతో ఈ యాక్షన్ థ్రిల్లర్ ను తెరకెక్కిస్తే ఇప్పటివరకు ఈ సినిమాకు రూ. 70 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో ఈ మూవీ ఆడుతోంది. అయితే అంతలోనే ఈ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో ఓటీటీలో సందడి చేయనున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా పేరు బ్లాస్ట్. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా నటించిన ఈ మూవీ తెలుగులో బ్లాస్ట్ జోన్ గా రిలీజైంది. మే 28న రిలీజైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. తమిళంతో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి రానుంది.
బ్లాస్ట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో గురువారం (జూన్ 25) నుంచి ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఓటీటీ సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
బ్లాస్ట్ సినిమా విషయానికి వస్తే సుభాష్ కె రాజ్ అనే కుర్రాడు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అతనికి ఇదే మొదటి సినిమా కావడం గమనార్హం. అయినా తన టేకింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు సుభాష్. ఈ చిత్రంలో అర్జున్ సర్జాతో పాటు చెప్పవే చిరుగాలి హీరోయిన్ అభిరామి, కన్నప్ప ఫేమ్ ప్రీతి ముకుందన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. మంచి యాక్షన్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి బ్లాస్ట్ ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.
📺 Missed it in theatres? Here’s your chance!#Blast arrives on Netflix from June 25, streaming in Tamil, Telugu, Kannada, Malayalam, and Hindi. 🔥
Enjoy the thrills, action, and entertainment anytime, anywhere!#Blast #NetflixPremiere pic.twitter.com/wa4hzM5D8L
— Mithun Cinemas🕺🏻 (@LearnEasy11) June 20, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.