
థియేటర్స్ లో విడుదలైన సినిమాలు కొన్ని నెలరోజుల లోపే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే మాత్రం ఓటీటీలోకి రావడానికి కొంచం టైం తీసుకుంటాయి. కొన్ని సినిమాలు మాత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటే మాత్రం వారం రోజుల్లోనే ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇప్పటికే ఓటీటీలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో విడుదలై విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ శుక్రవారం కూడా కొన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకులను మెప్పించాయి. ఇక ఇటీవల ఓ క్రేజీ సినిమా థియేటర్స్ లో సందడి చేసింది. ఇప్పుడు ఆ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఆ సినిమా మరేదో కాదు అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన మరీచిక
ఈ శుక్రవారం ఓటీటీల్లో దృశ్యం-3తో పాటు దురంధర్-2 తెలుగు కూడా మరో ఓటీటీకి వచ్చేసింది. అలాగే మరికొన్ని సినిమా కూడానా ఓటీటీలోకి వచ్చాయి. కామెడీ సిరీస్ సేవ్ ది టైగర్స్-3 టైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. అలాగే రవిబాబు నటించిన రేజర్ మూవీ కూడా ఓటీటీలోకి వచ్చింది. వీటితో పాటు అనుపమ పరమేశ్వరన్ నటించిన మరీచిక. అనుపమ పరమేశ్వరన్, రెజీనా, విరాజ్ అశ్విన్ నటించిన ఈ సినిమా సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కింది.
మంచి అంచనాల మధ్య ఈ సినిమా మే 29న థియేటర్లలో విడుదలైంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చింది. థియేటర్ లో విడుదలైన 3 వారల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాకు సతీశ్ కసెట్టి దర్శకత్వం వహించారు. అంతే కాదు ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. ఇక ఈ సినిమాను ఓటీటీలో చూసేయండి..
#Mareechika (Telugu)
Now streaming on PrimeVideo in Telugu & Tamil 🍿!!#OTT_Trackers pic.twitter.com/zjxsplI2Kp
— OTT Trackers (@OTT_Trackers) June 19, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి