Natyam Pre Release Event LIVE: రామ్ చరణ్ ముఖ్య అతిథిగా ‘నాట్యం’ ప్రీ రిలీజ్ ఫంక్షన్.. డ్యాన్స్‌పై ఇష్టంతోనే గెస్ట్‌గా హాజరవుతున్న చెర్రీ..

|

Oct 16, 2021 | 7:25 PM

Natyam Pre Release Event LIVE: ప్రముఖ నర్తకి సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న సినిమా 'నాట్యం'. నృత్య నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్..

Natyam Pre Release Event LIVE: రామ్ చరణ్ ముఖ్య అతిథిగా నాట్యం ప్రీ రిలీజ్ ఫంక్షన్.. డ్యాన్స్‌పై ఇష్టంతోనే గెస్ట్‌గా హాజరవుతున్న చెర్రీ..
Chief Guest Ram Charan For Sandhya Raju Natyam Movie Pre Release Event Live Video
Follow us on

Natyam Pre Release Event LIVE: ప్రముఖ నర్తకి సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘నాట్యం’. నృత్య నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరుగుతుంది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు అతిధిగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. నాట్యంపై ఉన్న మక్కువతోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు రామ్ చరణ్ హాజరయ్యారని తెలుస్తోంది.

సీనియర్ హీరోయిన్ భానుప్రియ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో  నిశ్రింకళ ఫిల్మ్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శ్రావణ్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది .

 

Also Read: తనకంటే 15 ఏళ్ళు చిన్నవాడైన యువకుడి ప్రేమలో 44 ఏళ్ల మహిళ.. అతనికి నెలకు 11 లక్షల జీతం..