స్టార్ హీరో సినిమాలో నటించనున్న నాని హీరోయిన్.. పల్లెటూరి అమ్మాయిగా రానున్న చెన్నై బ్యూటీ ?

|

Jan 21, 2021 | 4:48 PM

నాని హీరోగా నటించిన 'గ్యాంగ్ లీడర్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ప్రియాంకా అరుళ్ మోహన్. తన నటనతో

స్టార్ హీరో సినిమాలో నటించనున్న నాని హీరోయిన్.. పల్లెటూరి అమ్మాయిగా రానున్న  చెన్నై బ్యూటీ ?
Follow us on

నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ప్రియాంకా అరుళ్ మోహన్. తన నటనతో తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. ఇక ఆ తర్వాత యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న ‘శ్రీకారం’ సినిమాలో నటిస్తోంది ఈ చెన్నై బ్యూటీ. అంతేకాకుండా శివకార్తికేయన్‏తో కలిసి డాక్టర్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీతో తమిళంలోకి కూడా ఎంట్రీ ఇవ్వనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ బ్యూటీ మరో స్టార్ హీరోతో జతకట్టే ఛాన్స్ కొట్టేసిందట.

తమిళ స్టార్ హీరోయ సూర్య, డైరెక్టర్ పాండిరాజ్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గతేడాది చివరిదశలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చినప్పుటినుంచి.. ఇందులో సూర్య సరసన ఎవరు నటించబోతున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్‏గా ప్రియాంక మోహన్ ఎంపికైనట్లుగా కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది. రూరల్ డ్రామాగా రానున్న ఈ చిత్రంలో ప్రియాంక పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుందట.

Also Read:

‘లోఫర్’ బ్యూటీ ప్రాణాలకు ముప్పుందా.? చంపేస్తామంటూ ఆగంతకుల నుంచి బెదిరింపు కాల్స్.!