నంబర్‌తో మొదలయ్యే సినిమాలకు సక్సెస్ ఉండదా..!

| Edited By:

Sep 14, 2019 | 9:27 PM

మంచి సినిమాకు బలమైన కథ, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంత అవసరమో.. టైటిల్‌కు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. టైటిల్‌ను బట్టే కొన్ని సినిమాలపై ప్రేక్షకులకు ఆసక్తి పెరుగుతుంటుంది. అందుకే తమ స్టోరీకి తగ్గట్లుగా టైటిల్‌ను పెట్టేందుకు దర్శకనిర్మాతలు ఎన్నో కసరత్తులు చేస్తుంటారు. ఇక కొందరు దర్శకులు వినూత్నంగా ఆలోచించి తమ సినిమాలకు నంబర్‌లను పెడుతుంటారు. అయితే అలా నంబర్‌లతో టాలీవుడ్‌లోనూ పలు చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో కొన్ని మాత్రమే మంచి విజయాన్ని సాధించగా.. చాలా వరకు […]

నంబర్‌తో మొదలయ్యే సినిమాలకు సక్సెస్ ఉండదా..!
Follow us on

మంచి సినిమాకు బలమైన కథ, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంత అవసరమో.. టైటిల్‌కు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. టైటిల్‌ను బట్టే కొన్ని సినిమాలపై ప్రేక్షకులకు ఆసక్తి పెరుగుతుంటుంది. అందుకే తమ స్టోరీకి తగ్గట్లుగా టైటిల్‌ను పెట్టేందుకు దర్శకనిర్మాతలు ఎన్నో కసరత్తులు చేస్తుంటారు. ఇక కొందరు దర్శకులు వినూత్నంగా ఆలోచించి తమ సినిమాలకు నంబర్‌లను పెడుతుంటారు. అయితే అలా నంబర్‌లతో టాలీవుడ్‌లోనూ పలు చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో కొన్ని మాత్రమే మంచి విజయాన్ని సాధించగా.. చాలా వరకు యావరేజ్, ఫ్లాప్‌ల లిస్ట్‌లో చేరిపోయాయి. వాటిలో కొన్నింటిని మనం చూద్దాం.

1-నేనొక్కడినే
సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ తెరకెక్కించిన థ్రిల్లర్ మూవీ ‘1-నేనొక్కడినే’. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ముఖ్యంగా ఇందులో సుకుమార్ స్క్రీన్‌ప్లేకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే అన్ని వర్గాల వారిని ఈ థ్రిల్లర్ ఆకట్టుకోలేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది ‘1’. కానీ మహేష్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రాలలో ఈ మూవీ మాత్రం కచ్చితంగా ఉంటుంది.

24
సూర్య కథానాయకుడిగా వైవిధ్య దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం ’24’. టైమ్ మిషన్ కథాంశంతో ఫిక్షన్ కథగా తెరకెక్కిన ఈ మూవీ తమిళ్, తెలుగు రెండు భాషల్లో ఏక కాలంలో విడుదల అయ్యింది. అయితే టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన హిట్ కొట్టిన 24.. కోలీవుడ్‌లో మాత్రం యావరేజ్‌గా నిలిచింది.

3
ధనుష్, శ్రుతీ హాసన్ జంటగా.. ఐశ్వర్య ధనుష్ తెరకెక్కించిన చిత్రం ‘3’. అప్పట్లో ఈ సినిమా నుంచి విడుదలైన కొలవరి ఢీ అనే పాట సినిమాపై అమాంతం అంచనాలను పెంచేసింది. అయితే కథనంలో క్లారిటీ లేకపోవడం వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. కానీ ఈ చిత్రంలోని కొన్ని పాటలు చాలామంది ప్లే లిస్ట్‌లో ఇప్పటికీ మోగుతుంటాయి.

180
సిద్ధార్థ్, ప్రియా ఆనంద్, నిత్యా మీనన్ ప్రధాన పాత్రలలో యాడ్ ఫిలిం దర్శకుడు  జయేంద్ర తెరకెక్కించిన మొదటి చిత్రం ‘180’. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమై.. బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది.

100% లవ్
నాగ చైతన్య, తమన్నా హీరో హీరోయిన్లుగా లెక్కల మాష్టర్ సుకుమార్ తెరకెక్కించిన చిత్రం ‘100% లవ్’. బావ మరదలి మధ్య జరిగే ఈగోయిస్ట్ లవ్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. ముఖ్యంగా యూత్‌ను బాగా ఆకట్టుకున్న ఈ మూవీ నాగ చైతన్యకు మొదటి హిట్‌ను తీసుకొచ్చింది.

7th సెన్స్
విభిన్న నటుడు సూర్యతో మురగదాస్ చేసిన మరో ప్రయోగం ‘7th సెన్స్’. కథలో దమ్ము ఉన్నప్పటికీ.. ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకోలేకపోయింది. అయితే ఆ తరువాత బుల్లి తెరపై మాత్రం ఇప్పటికీ 7th సెన్స్ తన సత్తాను చాటుతూనే ఉంది.

143
తన సోదరుడు సాయి రామ్ శంకర్‌‌తో డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చిత్రం143. నక్సలైట్ బ్యాక్‌డ్రాప్‌తో లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో యూత్‌ను తెగ ఆకట్టుకున్నప్పటికీ.. అన్ని వర్గాలకు ఆకట్టుకోలేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది.

13B
వైవిధ దర్శకుడు విక్రమ్ కె కుమార్ తెరకెక్కించిన థ్రిల్లర్ మూవీ ’13 B’. మాధవన్ హీరోగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది. అంతేకాదు దర్శకుడిగా విక్రమ్‌కు మొదటి హిట్‌ను తీసుకొచ్చింది ఈ చిత్రం.

118
కల్యాణ్ రామ్, నివేథా థామస్, శాలినీ పాండే ప్రధాన పాత్రలలో కొత్త దర్శకుడు కేవీ గుహన్ తెరకెక్కించిన చిత్రం ‘118’. థ్రిల్లర్ కథాంశంతో వచ్చిన ఈ చిత్రం టాలీవుడ్ ప్రేక్షకులను బాగానే మెప్పించింది. ఇక ఈ సినిమా విజయంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు కల్యాణ్ రామ్.

1940లో ఓ గ్రామం
బాలాదిత్య, శ్రీ తదితరులు ముఖ్యపాత్రలలో నరసింహ నంది తెరకెక్కించిన మూవీ ‘1940లో ఓ గ్రామం’. గురజాడ అప్పారావు రచించిన ఘోష అనే కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలు వినిపించగా.. జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది. అయితే ప్రేక్షకులను మాత్రం ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

వీటిని బట్టి చూస్తే నంబర్లతో ప్రారంభమయ్యే సినిమా టైటిళ్లు చాలా తక్కువ మాత్రమే విజయాన్ని సాధించాయని చెప్పొచ్చు. మరి ఎవరైనా డైరక్టర్ నంబర్‌తో తన సినిమాను ప్రారంభించి అద్భుతమైన విజయాన్ని కొట్టి ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తారేమో చూడాలి.