కూతురితో సహా మాజీ నటి అదృశ్యం.. భర్త ఫిర్యాదు

| Edited By:

Sep 03, 2020 | 10:22 PM

తమిళనాడుకు చెందిన మాజీ నటి కుమార్తెతో సహా అదృశ్యమైంది. దీంతో ఆమె భర్త పోలీసులను ఆశ్రయించారు

కూతురితో సహా మాజీ నటి అదృశ్యం.. భర్త ఫిర్యాదు
Follow us on

Former Actress disappeared: తమిళనాడుకు చెందిన మాజీ నటి కుమార్తెతో సహా అదృశ్యమైంది. దీంతో ఆమె భర్త పోలీసులను ఆశ్రయించారు. వివరాల్లోకి వెళ్తే.. ‘చిన్న పూవే మేల్ల పెసు’ మూవీ ద్వారా వెండితెరకు పరిచయమైన నర్మద.. ఆ మూవీతోనే సినిమాలను గుడ్‌బై చెప్పారు. ఆ తరువాత తారాపురంకు చెందిన ఓ వ్యక్తిని వివాహమాడి గృహిణిగా స్థిరపడ్డారు. కాగా ఇటీవల తన 15 ఏళ్ల కుమార్తెతో సహా ఆమె అదృశ్యమైంది. బంధువులు సైతం గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో నర్మద భర్త తారాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న వారు దర్యాప్తును ప్రారంభించారు. కాగా ‘చిన్న పూవే మేల్ల పెసు’లో  రాంకీ, ప్రభు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. 1987 విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో పాటు నర్మదకు మంచి పేరు తీసుకొచ్చింది. అయితే కారణాల తెలీవు గానీ ఆ మూవీతోనే తన సినీ కెరీర్‌ని నర్మద వదిలేశారు.

Read More:

షారూక్‌ని అట్లీ ఎలా చూపించబోతున్నారంటే!

గంగూలీ సహా పలువురి బయోపిక్‌లో నటించాలనుకున్న సుశాంత్