ప్రభాస్ మూవీలో ఆ ఇద్దరు హీరోలు ?.. మళ్ళీ మల్టీస్టారర్ రాబోతుందా ? ఏ సినిమాలో అంటే..

|

Dec 12, 2020 | 1:01 PM

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బీజిగా ఉన్నారు. బహుబలి భారీ హిట్ అనంతరం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‏గా మారిపోయారు.

ప్రభాస్ మూవీలో ఆ ఇద్దరు హీరోలు ?.. మళ్ళీ మల్టీస్టారర్ రాబోతుందా ? ఏ సినిమాలో అంటే..
Follow us on

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బీజిగా ఉన్నారు. బహుబలి భారీ హిట్ అనంతరం ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‏గా మారిపోయారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రం షూటింగ్ పూర్తికావోచ్చింది. ఇక అటు ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా చేయనున్నారు. దాంతోపాటు జాతీయ స్థాయి డైరెక్టర్‏గా పేరోందిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ చేస్తున్నాడు. ఇటీవల విడుదల సలార్ ఫస్ట్‏లుక్ ఫోస్టర్‏కు భారీగా వ్యూస్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలో ప్రముఖ నటులు దగ్గుపాటి రానా, మోహన్ లాల్ నటించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా రానా, ప్రభాస్ ఇప్పటికే బహుబలి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. తర్వాత రానా, ప్రభాస్ కలిసి నటిస్తున్నారని వార్తాలు వచ్చినా అవన్ని నిజం కాలేకపోయాయి. అయితే ఇప్పుడు సలార్ సినిమాలో మోనాన్ లాల్, రానా కలిసి నటించనున్నారని ఫీల్మ్ నగర్‏లో వార్తాలు చక్కర్లు కొడుతున్నాయి. మరీ ఈ వార్త నిజామో కాదే తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.