Lucifer Movie Update: షూటింగ్ ప్రారంభించిన మెగాస్టార్ ‘లూసిఫర్’.. చిరంజీవి కెరీర్లో 153వ చిత్రంగా రానున్న..

|

Jan 20, 2021 | 8:47 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం 'ఆచార్య' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఆచార్య తర్వాత చిరంజీవి మలయాళ బ్లాక్ బస్టర్

Lucifer Movie Update: షూటింగ్ ప్రారంభించిన మెగాస్టార్ లూసిఫర్.. చిరంజీవి కెరీర్లో 153వ చిత్రంగా రానున్న..
Follow us on

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఆచార్య తర్వాత చిరంజీవి మలయాళ బ్లాక్ బస్టర్ సినిమా లూసిఫర్ తెలుగు రీమేక్‏లో నటించనున్న సంగతి తెలిసిందే. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, మరియు సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఎన్వీఆర్ సినిమా బ్యానర్లపై ఆర్.బీ చౌదరి, ఎన్.వి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తనివరువన్ ఫేం మోహన్ రాజా ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. బుధవారం ఈ సినిమా షూటింగ్ ఫిల్మ్ నగర్లోని సూపర్ గుడ్ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయింది. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తుండగా.. చిరంజీవి కెరీర్‏లో ఇది 153వ చిత్రంగా రానుంది. ఫిబ్రవరి నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతందని.. మన కల్చర్‏కు తగ్గట్టుగా ఈ సినిమాను మోహన్ రాజా అద్బుతంగా సిద్దం చేసారని.. మెగాస్టార్ కెరీర్లోనే బ్లాక్ బస్టర్ సినిమాగా ఇది నిలుస్తుందని చిత్ర నిర్మాతలు తెలిపారు.

Also Read: సీటీమార్ రీ స్టార్ట్ : రెడీ అంటోన్న టీమ్..బరిలోకి గోపిచంద్

మెగాస్టార్​ కుమార్తె నిర్మాణంలో ‘షూట్​ అవుట్​ ఎట్​ అలైర్’​ , ఆకట్టుకుంటోన్న టీజర్