యువ హీరోలతో పోటీపడుతూ వరుసగా సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన నటించిన ‘ఆచార్య’ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుత చిరంజీవి జయం మోహన రాజా డైరెక్షన్లో ‘లూసిఫర్’ రీమెక్ ‘గాడ్ ఫాదర్’లో నటించనున్నారు. ఇటీవలే ఊటీలో ఈ సినిమాకు సంబంధించి కొంతమేర షూటింగ్ కూడా జరిగింది. ఆ వెంటనే బాబీ దర్శకత్వంలో మరొక సినిమాను ప్రకటించారు. ఇక ఈనెల 11న మెహర్ రమేశ్ డైరెక్షన్లో ‘భోళా శంకర్’ను అధికారికంగా ప్రారంభించారు. తమిళ ‘వేదాళం’కు రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మెగాస్టార్‌కు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించనుంది. కీర్తి సురేశ్ చిరుకి చెల్లెలిగా నటించనుంది. కాగా సోమవారం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.
పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో..
ఈ సందర్భంగా దర్శకుడు మెహర్ రమేశ్ పెద్దమ్మతల్లి ఆశీస్సులు తీసుకుని మొదటి రోజు షూటింగ్ ప్రారంభించారు. ఈ విషయాన్ని తనే ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. కాగా కన్నడలో హిట్ సినిమాలు తీసిన మెహర్ రమేశ్ ‘కంత్రి’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ప్రభాస్ ‘బిల్లా’ సినిమాతో స్టైలిష్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అయితే వీటి తర్వాత ఆయన చేసిన ‘శక్తి’, ‘షాడో’ ప్రతికూల ఫలితాలనిచ్చాయి. దీంతో సుదీర్ఘ విరామం తీసుకుని మళ్లీ తెరపైకొచ్చాడు. ఏకంగా మెగాస్టార్‌తో మూవీ తీసే అదృష్టం దక్కించుకున్నాడు. కాగా ఈ సినిమాకు మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ స్వరాలు సమకూరుస్తున్నారు.
jr.NTR in RRR: ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న తారక్ లుక్స్ అండ్ పోస్టర్స్..
Lakshmi Manchu: ట్రేండింగ్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న ‘మంచు లక్ష్మి’ న్యూ ఫొటోస్..