Master: థియేటర్లపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలి… తమిళనాడు ప్రభుత్వాన్ని కోరిన సినీ హీరో విజయ్‌

| Edited By: Ravi Kiran

Dec 29, 2020 | 6:17 AM

కోవిడ్ కారణంగా సినిమా థియేటర్లపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని తమిళ సినీ హీరో విజయ్‌ తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామికి విజయ్‌ అభ్యర్థన చేశారు.

Master: థియేటర్లపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలి... తమిళనాడు ప్రభుత్వాన్ని కోరిన సినీ హీరో విజయ్‌
Follow us on

కోవిడ్ కారణంగా సినిమా థియేటర్లపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని తమిళ సినీ హీరో విజయ్‌ తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామికి విజయ్‌ అభ్యర్థన చేశారు. కాగా, ప్రస్తుతం విజయ్‌ కథానాయకుడిగా నటించిన ‘మాస్టర్‌’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. సంక్రాంతికి కానుకగా ఈ సినిమాను అభిమానుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 2021 జనవరి 7 నుంచి టికెట్ల బుకింగ్‌ ప్రారంభించనున్నట్లు వార్తలు వచ్చాయి.

 

ఈ క్రమంలో థియేటర్లపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను సడలించి, 100శాతం ప్రేక్షకులను అనుమతించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని విజయ్‌ కోరారు. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్‌ సరసన మాళవికా మోహన్‌ నటించనుంది. విజయ్ సేతుపతి, అర్జున్‌ దాస్, సిమ్రన్‌, ఆండ్రియా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీత దర్శకులు. ఎక్స్‌బీ ఫిల్మ్స్‌, సెవన్‌ స్క్రీన్‌ స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. తమిళంతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో చిత్రాన్ని విడుదల కానుంది.