మెగా మేనల్లుడికి బెస్ట్ విషెస్ తెలిపిన సూపర్ స్టార్.. మైల్ స్టోన్ గా నిలిచిపోవాలని కోరుకున్న మహేష్

|

Dec 24, 2020 | 4:02 PM

కరోనా కారణంగా ఇన్నినెలలు మూత పడ్డ సినిమా థియేటర్స్ ఇటీవలే తెరుచుకున్నాయి. థియేటర్స్ రీఓపెన్ అయిన తర్వాత

మెగా మేనల్లుడికి బెస్ట్ విషెస్ తెలిపిన సూపర్ స్టార్.. మైల్ స్టోన్ గా నిలిచిపోవాలని కోరుకున్న మహేష్
Follow us on

కరోనా కారణంగా ఇన్నినెలలు మూత పడ్డ సినిమా థియేటర్స్ ఇటీవలే తెరుచుకున్నాయి. థియేటర్స్ రీఓపెన్ అయిన తర్వాత విడుదలవుతున్న తొలి సినిమా ‘సోలో బ్రతుకే సోబెటర్’ ఈ సినిమా డిసెంబర్ 25 న క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సాయిధరమ్ తేజ్ హీరోగా నూతన దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఇస్మార్ట్ బ్యూటీ నభనటేష్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించారు. ఇక ఈ సినిమా కు పలువురు ప్రముఖులు బెస్ట్ విషెస్ అందిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి టీమ్ కు శుభాకాంక్ష‌లు తెలుపగా తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలిపారు. ‘కరోనా తరవాత థియేట్సర్ లో విడుదలవుతున్న ఫస్ట్ సినిమాగా సోలో బ్రతుకే సో బెటర్ సినిమా మైల్ స్టోన్ గా  నిలిచిపోతుంది. సాయిధరమ్ తేజ్ కు సోలోబ్రతుకే సోబెటర్ ఎంటైర్ టీమ్ కు బెస్ట్ విషెస్’ అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.