Sitara Ghattamaneni : మొదటిసారి మీడియా ముందుకు మహేష్ ముద్దుల కూతురు.. చాలా సీక్రెట్స్ బయటపెట్టిన సితార

|

Jan 01, 2021 | 8:16 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలివుడ్ టాప్ హీరోగా రాణిస్తున్నారు. ఇక మహేష్ తో పాటు ఆయన ముద్దుల కూతురు సితార కూడా సోషల్ మీడియాలో..

Sitara Ghattamaneni : మొదటిసారి మీడియా ముందుకు మహేష్ ముద్దుల కూతురు.. చాలా సీక్రెట్స్  బయటపెట్టిన సితార
Follow us on

Sitara Ghattamaneni : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం టాలివుడ్ టాప్ హీరోగా రాణిస్తున్నారు. ఇక మహేష్ తో పాటు ఆయన ముద్దుల కూతురు సితార కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. మహేష్ వెండి తెరను ఏలేస్తుంటే .. సితార సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఇప్పటికే డ్యాన్స్ వీడియోలతో ఈ చిన్నారి చాలా ఫేమస్ అయ్యింది. ఇటీవల ఈ లిటిల్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ గాను మారిపోయింది. ‘ఫన్’టాస్టిక్ తార అనే వెబ్ సిరీస్ కు సితార బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది.

తన తండ్రి మహేష్ సినిమాలోని పాటలకు డ్యాన్స్ లు వేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది సితార. ఇక ఈ లిటిల్ స్టార్ మొదటి సారి మీడియా ముందుకు వచ్చింది. టీవీ9 తో మాట్లాడుతూ తనకు యాక్టర్ అవ్వాలని ఉందని తెలిపింది. ప్రస్తుతానికి ఎలాంటి ప్లాన్స్ లేకున్నా తప్పకుండా హీరోయిన్ అవుతా అంటుంది సితార. తన తండ్రి మహేష్ బాబు తో పాటు షూటింగ్ స్పాట్ కు వెళ్ళినప్పుడు ఆ సెట్, అక్కడి వాతావరణం అదంతా తనకు ఎంతో ఇష్టమని చెప్పుకోచింది. త్వరలోనే అవకాశం వస్తే తన అన్న గౌతమ్ తో కలిసి నటించాలని ఉందని తెలిపింది సితార. అలాగే తనకు రష్మిక అంటే చాలా ఇష్టమని చెప్పింది. రష్మిక చాలా మంచిదని, చాలా అల్లరి చేస్తూ సరదాగా ఉంటుందని తెలిపింది. తన తండ్రితో, అన్నతో కలిసి స్విమింగ్ చేయడం చాలా ఇష్టమంట ఈ లిటిల్ స్టార్ కు.