అమ్మ బయోపిక్: జయ మేనకోడలికి హైకోర్టు షాక్

| Edited By:

Dec 13, 2019 | 1:31 PM

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. అమ్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తోన్న సినిమా, వెబ్‌ సిరీస్‌ను అడ్డుకోవాలంటూ దీప మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిని విచారించిన హైకోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అయితే పిటిషనర్‌కి సంబంధించి ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు ఉండకూడదని, ఆమె పాత్రను ఒక సీన్‌కు మాత్రమే పరిమితం చేయాలని సంబంధిత దర్శకులకు సూచించింది. అయితే జయలలిత జీవిత కథ ఆధారంగా […]

అమ్మ బయోపిక్: జయ మేనకోడలికి హైకోర్టు షాక్
Follow us on

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. అమ్మ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తోన్న సినిమా, వెబ్‌ సిరీస్‌ను అడ్డుకోవాలంటూ దీప మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిని విచారించిన హైకోర్టు ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అయితే పిటిషనర్‌కి సంబంధించి ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు ఉండకూడదని, ఆమె పాత్రను ఒక సీన్‌కు మాత్రమే పరిమితం చేయాలని సంబంధిత దర్శకులకు సూచించింది.

అయితే జయలలిత జీవిత కథ ఆధారంగా కోలీవుడ్‌లో రెండు సినిమాలు, ఒక వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. వీటిలో కంగనా రనౌత్ ప్రధానపాత్రలో ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తోన్న తలైవి, నిత్యామీనన్ హీరోయిన్‌గా ప్రియదర్శిని తెరకెక్కిస్తోన్న ఐరన్ లేడీలు సినిమాలు కాగా.. రమ్యకృష్ణన్ ప్రధానపాత్రలో గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తోన్న క్వీన్‌లు వెబ్ సిరీస్‌గా రానున్నాయి. ఇక క్వీన్‌కు సంబంధించి ఇటీవల టీజర్ కూడా విడుదలైంది. ఈ క్రమంలో వీటి విడుదలను ఆపేయాలంటూ దీపా హైకోర్టును ఆశ్రయించారు. ఇక కాల్పనికత ఆధారంగా తాము క్వీన్‌ను తెరకెక్కించినట్లు గౌతమ్ మీనన్ డిస్‌క్లైమర్ వేయించాలని కూడా హైకోర్టు సూచించింది. కాగా త్వరలోనే క్వీన్ వెబ్ సిరీస్ ఆన్‌లైన్‌లో విడుదల కానుంది. అలాగే తలైవి, ఐరన్ లేడి చిత్రాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.