రష్మికపై కోలీవుడ్‌ చిత్రబృందం ఫైర్!

| Edited By:

Aug 20, 2019 | 9:41 AM

‘గీత గోవిందం’ తెలుగు చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న నటి రష్మిక. ఇటీవల ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంతో మళ్లీ ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు కార్తికి జోడీగా ఓ చిత్రంలో నటిస్తోంది. విజయ్‌ సరసన కూడా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మాణంలో ఇంకా పేరుపెట్టని ఓ చిత్రంలో నటిస్తోంది రష్మిక. భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నెపోలియన్‌, యోగిబాబు, సతీష్‌, మలయాళ నటుడు లాల్‌ తదితరులు ఇతర తారాగణం. […]

రష్మికపై కోలీవుడ్‌ చిత్రబృందం ఫైర్!
Follow us on

‘గీత గోవిందం’ తెలుగు చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న నటి రష్మిక. ఇటీవల ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రంతో మళ్లీ ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరైంది. ఇప్పుడు కార్తికి జోడీగా ఓ చిత్రంలో నటిస్తోంది. విజయ్‌ సరసన కూడా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మాణంలో ఇంకా పేరుపెట్టని ఓ చిత్రంలో నటిస్తోంది రష్మిక. భాగ్యరాజ్‌ కన్నన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నెపోలియన్‌, యోగిబాబు, సతీష్‌, మలయాళ నటుడు లాల్‌ తదితరులు ఇతర తారాగణం.

ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ను త్వరలోనే భారీ స్థాయిలో విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. అందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించాలని అనుకుంది. అయితే ఉన్నట్టుండి నటి రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘‘సుల్తాన్‌’ సినిమా చిత్రీకరణలో నాలుగోరోజు’ అంటూ ఓ ఫొటోను కూడా పోస్ట్‌ చేసింది. దీంతో చిత్రబృందం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఎలాంటి సస్పెన్స్‌ లేకుండా ఇలా చెప్పడంతో బృందం తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది.