Mahesh Babu: మహేష్ బాబుతో ఫస్ట్ సినిమా.. స్టార్ హీరోయిన్ అయ్యేది.. ఇప్పుడు పెద్ద కంపెనీలో సీఈవో..

సాధారణంగా సినీరంగంలో నటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని చాలా మంది వస్తుంటారు. అయితే కొందరు ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంటారు. కానీ కెరీర్ అత్యుత్తమ స్థాయిలో ఉన్నప్పుడే సినిమాలకు గుడ్ బై చెప్పేసి వెళ్లిపోతారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ సైతం అలాంటి జాబితాలోకి చెందినవారే.

Mahesh Babu: మహేష్ బాబుతో ఫస్ట్ సినిమా.. స్టార్ హీరోయిన్ అయ్యేది.. ఇప్పుడు పెద్ద కంపెనీలో సీఈవో..
Mahesh Babu

Updated on: Sep 11, 2026 | 11:11 AM

90వ దశకంలో తన అందచందాలతో, అభినయంతో యువతను ఉర్రూతలూగించిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. అందులో ఒకప్పటి అందమైన తార నటి మయూరి కాంగో ఒకరు. ఈ పేరు చెబితే ఇప్పుడు అస్సలు గుర్తుపట్టరు. కానీ ఒకప్పుడు ఆమె కుర్రాళ్ల అందాల దేవత. ఈమె పేరు చెప్పగానే అప్పట్లో వచ్చిన మ్యూజికల్ హిట్టల్లాగే ఎన్నో మధురమైన జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. అయితే అప్పట్లో కథానాయికగా అలరించింది. ఇప్పుడు బిజినెస్ ఉమెన్ గా దూసుకుపోతుంది. కేవలం నటిగా మాత్రమే కాకుండా, అసాధారణ ప్రతిభతో ఉన్నత విద్యను అభ్యసించి, కార్పొరేట్ రంగంలో అగ్రస్థానానికి చేరుకున్న మయూరి ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకమనే చెప్పాలి. మయూరి కాంగో మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జన్మించారు. ఆమె తల్లి ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్, తండ్రి రాజకీయ నాయకుడు. చదువులో ఎప్పుడూ ముందుండే మయూరి ప్రతిష్టాత్మకమైన ఐఐటీ (IIT) ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఐఐటీ కాన్పూర్‌లో అడ్మిషన్ కూడా పొందారు.

అయితే అదే సమయంలో సినిమాల్లో నటించే అవకాశం రావడంతో, ఉన్నత చదువులకంటే నటనపై ఉన్న మక్కువతో ఆ అడ్మిషన్‌ను వదులుకున్నారు. 1995లో సయీద్ అక్తర్ మీర్జా దర్శకత్వంలో వచ్చిన ‘నసీమ్’ సినిమాతో ఆమె నటిగా తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత మహేష్ భట్ తెరకెక్కించిన ‘పాపా కెహతే హైన్’ (1996) చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమాలో ఆమెపై వచ్చిన “ఘర్ సే నికల్తే హి…” పాట అప్పట్లో సంచలనం సృష్టించింది. హిందీలో బేతాబి, బాదల్ వంటి పలు చిత్రాల్లో నటించిన ఆమె, టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘వంశీ’ (2000) చిత్రంలోనూ కీలక పాత్రలో మెప్పించారు.

సినిమా రంగంలో కొంతకాలం పనిచేసిన తర్వాత ఆమె సినిమాలకు దూరమయ్యారు. 2003లో ఆదిత్య ధిల్లాన్‌ను వివాహం చేసుకుని అమెరికాకు వెళ్లారు. అక్కడ న్యూయార్క్‌లోని బరూచ్ కాలేజీలో మార్కెటింగ్ మరియు ఫైనాన్స్‌లో ఎంబీఏ (MBA) పూర్తి చేశారు. సాధారణ గృహిణిగా ఉండకుండా కార్పొరేట్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆమె లక్ష్యంగా పెట్టుకున్నారు. అమెరికాలో డిజిటల్ మార్కెటింగ్ రంగంలో చిన్న ఉద్యోగంతో కెరీర్ ప్రారంభించి, క్రమంగా ఉన్నత స్థాయికి చేరుకున్నారు. భారతదేశానికి తిరిగి వచ్చాక ప్రముఖ డిజిటల్ ఏజెన్సీల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత టెక్ దిగ్గజం ‘గూగుల్ ఇండియా’ (Google India) లో ఇండస్ట్రీ హెడ్‌గా బాధ్యతలు చేపట్టి సంచలనం సృష్టించారు. గూగుల్‌లో ప్రముఖ పాత్ర పోషించిన ఆమె, తదనంతరం పబ్లిసిస్ గ్రూప్ గ్లోబల్ డెలివరీ డివిజన్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా (CEO) ఎదిగారు.

ఎక్కువమంది చదివినవి : Bigg Boss 10 Telugu : లక్షలు ఇస్తామన్నా వద్దన్నారు.. బిగ్ బాస్ 10 ఆఫర్ రిజెక్ట్ చేసిన సెలబ్రిటీస్ వీళ్లే..

మయూరి కాంగో..

Mayoori Kango

ఎక్కువమంది చదివినవి : Cinema : ఆద్యంతం సస్పెన్స్.. దుమ్మురేపుతున్న కోర్ట్ డ్రామా.. 7 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్..

Loading...
Unable to load recommendations.
Follow Us