‘ఎఫ్‏సీయూకే’ నుంచి కార్తీక్ ఫోటో రివీల్.. ఫుల్ కామెడీ ఎంటర్‏టైన్మెంట్‏గా రానున్న జగపతి బాబు సినిమా..

|

Dec 30, 2020 | 8:44 AM

టాలీవుడ్ ఫ్యామిలీ హీరో జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్‏లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. లెజెండ్ సినిమాతో విలన్‏గా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. తాజాగా జగపతి బాబు

ఎఫ్‏సీయూకే నుంచి కార్తీక్ ఫోటో రివీల్.. ఫుల్ కామెడీ ఎంటర్‏టైన్మెంట్‏గా రానున్న జగపతి బాబు సినిమా..
Follow us on

టాలీవుడ్ ఫ్యామిలీ హీరో జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్‏లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. లెజెండ్ సినిమాతో విలన్‏గా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. తాజాగా జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఎఫ్‏సీయూకే (ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్). రొమాంటింగ్ కామెడీ ఎంటర్‏టైన్మెంట్ కథాంశంతో ఈ సినిమా రాబోతుంది. చాలా రోజుల తర్వాత జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లను రోజుకో పాత్రను రివీల్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇందులో భాగంగా మొదటగా ఫాదర్ పాత్రలో ఉన్న జగపతి బాబు పోస్టర్‏ను విడుదల చేసింది చిత్రబృందం. ఆ తర్వాత చిట్టి పాత్రలో ఉన్న బేబీ సహశ్రీత పోస్టర్ విడుదల చేశారు. అనంతరం ఉమా పాత్రలో ఉన్న అమ్ము అభిరామ్ పోస్టర్ విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కార్తీక్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ చూడగానే కార్తీక్ పాత్ర అల్లరిచిల్లరగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ఫుల్ కామెడీ ఉండబోతుందనేది ఈ పోస్టర్ల ద్వారా అర్ధమవుతోంది. విద్యాసాగర్ రాజు మూవీకి దర్శకత్వం వహిస్తుండగా.. నిర్మాత దాపు తన సొంత బ్యానర్ శ్రీరంజిత్ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. కాగా వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. సెకండ్ ఇన్సింగ్స్‏లో జగపతి బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.