ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‏లో సినిమా.. కీలక పాత్రలో నటించనున్న కన్నడ స్టార్ హీరో ?..

| Edited By: Pardhasaradhi Peri

Dec 30, 2020 | 8:20 AM

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‏లో ఓ సినిమా రాబోతుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అరవింద సమేత సినిమా బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది.

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‏లో సినిమా.. కీలక పాత్రలో నటించనున్న కన్నడ స్టార్ హీరో ?..
Follow us on

ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్‏లో ఓ సినిమా రాబోతుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అరవింద సమేత సినిమా బ్లాక్ బాస్టర్ విజయం సాధించింది. మళ్లీ వీరి సూపర్ కాంబినేషన్లో సినిమా రాబోతుండడంతో అభిమానులు ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళీ తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‏లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మూవీ చేయనున్నాడు. కాగా ఈ చిత్రానికి అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోయే సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్‏తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించనున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమాలో విలన్ ఎవరనేది మాత్రం తెలియలేదు. తాజాగా ఈ సినిమాలో కన్నడ స్టార్ యాక్టర్ ఉపేంద్ర విలన్ రోల్ చేయనున్నట్లుగా ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. పొలిటికల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుండగా.. ఉపేంద్ర కీలక పాత్రలో నటించనున్నట్లుగా సమాచారం. గతంలో త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర కీలక పాత్రలో నటించాడు. నిజంగానే ఈ సినిమాలో ఉపేంద్ర నటించనున్నాడ లేదా అనేది తెలియాల్సి ఉంది.