అదిరిపోయిన ‘కళంక్’ సినిమా టీజర్

| Edited By:

Mar 12, 2019 | 3:20 PM

‘కళంక్’ సినిమా టీజర్‌ను విడుదలచేసింది చిత్రబృందం. ఎంతో ఉత్కంఠభరితంగా ఈ టీజర్ కనిపిస్తోంది. 1945లో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఓ యువరాణికి, ఓ సాధారణ వ్యక్తికి మధ్య పుట్టిన ప్రేమకథ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. ఇందులో రూప్ అనే యువరాణి పాత్రలో ఆలియా భట్ నటించారు. టీజర్‌లోని ప్రతి సన్నివేశం, సినిమాపై అంచనాలను పెంచే విధంగా ఉంది. ఒకరిని నాశనం చేస్తేనే అది మన విజయం అవుతుందంటే.. ఈ ప్రపంచంలో మనకంటే ఓటమిపాలైనవారు మరొకరుండరు అంటూ టీజర్ […]

అదిరిపోయిన ‘కళంక్’ సినిమా టీజర్
Follow us on

‘కళంక్’ సినిమా టీజర్‌ను విడుదలచేసింది చిత్రబృందం. ఎంతో ఉత్కంఠభరితంగా ఈ టీజర్ కనిపిస్తోంది. 1945లో భారతదేశానికి స్వాతంత్రం రాకముందు ఓ యువరాణికి, ఓ సాధారణ వ్యక్తికి మధ్య పుట్టిన ప్రేమకథ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించారు. ఇందులో రూప్ అనే యువరాణి పాత్రలో ఆలియా భట్ నటించారు. టీజర్‌లోని ప్రతి సన్నివేశం, సినిమాపై అంచనాలను పెంచే విధంగా ఉంది. ఒకరిని నాశనం చేస్తేనే అది మన విజయం అవుతుందంటే.. ఈ ప్రపంచంలో మనకంటే ఓటమిపాలైనవారు మరొకరుండరు అంటూ టీజర్ చివర్లో వచ్చిన డైలాగ్ హైలెట్ గా నిలిచింది.

బాలీవుడ్ నటులు మాధురీ దీక్షిత్, సంజయ్ దత్, ఆలియా భట్, వరుణ్ ధావన్, సోనాక్షి సిన్హా, ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కళంక్’. అభిషేక్ వర్మన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఏప్రిల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.