భారత్‌లో ‘మిడతల దాడి’.. సూర్య దర్శకుడు ముందే ఎలా ఊహించారంటే..!

| Edited By:

May 28, 2020 | 2:13 PM

కరోనా సమయంలో భారత్‌ను ఇబ్బంది పెడుతోన్న మరో సమస్య ‘మిడతల దాడి’. పాకిస్థాన్ నుంచి వచ్చిన మిడతల దండు భారత్‌లో బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే ఉత్తరాదిన వేల ఎకరాల పంటను నాశనం చేసిన ఈ మిడతల దండు, ఇప్పుడు దక్షిణాదికి కూడా వచ్చేస్తోంది. దీంతో అటు రైతులు, ఇటు అధికారుల్లో టెన్షన్ ఎక్కువవుతోంది. అయితే ఈ మిడతల దాడి గురించి సూర్య నటించిన కప్పాన్(తెలుగులో బందోబస్తు) చిత్రంలో దర్శకుడు కేవీ ఆనంద్‌ చూపించారు. గతేడాది వచ్చిన ఈ […]

భారత్‌లో మిడతల దాడి.. సూర్య దర్శకుడు ముందే ఎలా ఊహించారంటే..!
Follow us on

కరోనా సమయంలో భారత్‌ను ఇబ్బంది పెడుతోన్న మరో సమస్య ‘మిడతల దాడి’. పాకిస్థాన్ నుంచి వచ్చిన మిడతల దండు భారత్‌లో బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే ఉత్తరాదిన వేల ఎకరాల పంటను నాశనం చేసిన ఈ మిడతల దండు, ఇప్పుడు దక్షిణాదికి కూడా వచ్చేస్తోంది. దీంతో అటు రైతులు, ఇటు అధికారుల్లో టెన్షన్ ఎక్కువవుతోంది. అయితే ఈ మిడతల దాడి గురించి సూర్య నటించిన కప్పాన్(తెలుగులో బందోబస్తు) చిత్రంలో దర్శకుడు కేవీ ఆనంద్‌ చూపించారు. గతేడాది వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ.. ఇప్పుడు మిడతల ఎపిసోడ్‌తో ‘కప్పాన్’ చిత్రం మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది.

అయితే ఈ మిడతల అటాక్‌ను ముందే ఊహించి సినిమాలో చూపడానికి రియల్ లైఫ్‌లో తాను చూసిన ఓ నిజ జీవిత సంఘటనే కారణమని ఆనంద్ తాజాగా చెప్పారు. 9 సంవత్సరాల క్రితం సూర్యతో తెరకెక్కించిన మాత్రాన్(తెలుగులో బ్రదర్స్) కోసం నేను మడగాస్కర్‌ వెళ్లాను. ఆ సమయంలో అక్కడ మిడతలు దాడి చేశాయి. దాని వలన నా కారును రోడ్డుపైనే కొన్ని గంటల పాటు ఆపాల్సి వచ్చింది. ఆ తరువాత అక్కడి స్థానికుల నుంచి మిడతల దాడి గురించి కాస్త సమాచారాన్ని తెలుసుకుని కాప్పాన్‌లో పెట్టాను అని అన్నారు. ఇక మిడతల సంఖ్య పెరగకుండా ఉండేందుకు కూడా ఆనంద్ కొన్ని సూచనలు చేశారు. మగ మిడతల్లో సంతానోత్పత్తికి అవసరమయ్యే వాటిని తొలగించడం ద్వారా వీటి సంఖ్యను తగ్గించొచ్చని, తద్వారా భారీ నష్టాన్ని ఆపొచ్చని ఆయన అన్నారు.

Read This Story Also: లాక్‌డౌన్‌ పిచ్చోళ్లను చేసింది.. రూమర్లపై సాక్షి ఘాటు కామెంట్లు..!