రియల్ లైఫ్ మరిది.. రీల్ లైఫ్ తమ్ముడు

|

Apr 16, 2019 | 7:23 PM

తమిళ హీరో కార్తీ జయాపజయాలను పట్టించుకోకుండా వరస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆయన తాజాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘ఖైదీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా తరువాత ఆయన చేయనున్న సినిమాలో జ్యోతిక ఒక ముఖ్య పాత్ర పోషించనుందని కోలీవుడ్ టాక్. కాగా ఇందులో ఆయన జ్యోతిక సోదరుడిగా కనిపించనున్నాడని సమాచారం. ఈ చిత్రానికి ‘దృశ్యం’ ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకుడు. జ్యోతిక సోదరుడు సూరజ్ […]

రియల్ లైఫ్ మరిది.. రీల్ లైఫ్ తమ్ముడు
Follow us on

తమిళ హీరో కార్తీ జయాపజయాలను పట్టించుకోకుండా వరస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆయన తాజాగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘ఖైదీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమా తరువాత ఆయన చేయనున్న సినిమాలో జ్యోతిక ఒక ముఖ్య పాత్ర పోషించనుందని కోలీవుడ్ టాక్. కాగా ఇందులో ఆయన జ్యోతిక సోదరుడిగా కనిపించనున్నాడని సమాచారం.

ఈ చిత్రానికి ‘దృశ్యం’ ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకుడు. జ్యోతిక సోదరుడు సూరజ్ నిర్మించనున్న ఈ చిత్రంలో మిగిలిన తారాగణం ఎవరనేది తెలియాల్సి ఉంది.