ప్రభాస్ కోసం సెన్సేషనల్ మ్యూజీషియన్‌

| Edited By:

Jul 07, 2020 | 10:05 PM

ప్రస్తుతం ప్రభాస్‌ జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరన్నది ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు.

ప్రభాస్ కోసం సెన్సేషనల్ మ్యూజీషియన్‌
Follow us on

ప్రస్తుతం ప్రభాస్‌ జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరన్నది ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. ఈ మూవీకి జాతీయ అవార్డు గ్రహీత అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నట్లు తెలిసినా.. కొన్ని కారణాల వలన ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఈ క్రమంలో డియర్ కామ్రేడ్‌ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకర్‌ పేరు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయాన్ని అటు చిత్ర యూనిట్‌ గానీ, జస్టిన్ గానీ ఖరారు చేయలేదు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సంగీత దర్శకుడిగా ఇప్పుడు మరో మ్యూజీషియన్‌ పేరు వినిపిస్తోంది.

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌లో దిగ్గజంగా పేరొందిన జులియస్ పకియమ్‌, ప్రభాస్‌ మూవీకి సంగీతం అందించబోతున్నట్లు టాక్‌ నడుస్తోంది. పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతుండగా.. ఇందుకోసం జులియస్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా బాలీవుడ్‌లో ఏక్తా టైగర్‌, ధూమ్ 3, బాఘీ 2, టైగర్ జిందాహై, భారత్, బజరంగీ భాయ్‌జాన్‌, సుల్తాన్ తదితర చిత్రాలకు బ్యాక్‌గ్రౌండ్ అందించిన జులియస్‌., తెలుగులో సైరాకు పనిచేశారు. ఇక రొమాంటిక్ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. భానుశ్రీ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.