నరసింహనంది దర్శకత్వంలో భీమవరం టాకీస్ బ్యానర్ పై తుమ్మల పల్లి రామ సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘జాతీయ రహదారి’. ఈ చిత్రంలో మధుచిట్టి, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫీల్మ్ ఫేర్ అవార్డుకు నామినేట్ అయింది. ఈ సందర్భంగా నిర్మాత అంబికా కృష్ణ జాతీయ రహదారి చిత్ర దర్శకుడు, నిర్మాతలకు అభినందనలకు తెలిపారు. అనంతరం అంబికా కృష్ణ మాట్లాడుతూ.. “రామ సత్యనారాయణ ధైర్యంగా వంద సినిమాలు పూర్తిచేసుకొని 101వ సినిమాగా జాతీయ రహదారితో మీ ముందుకు వస్తుండటం అభినందించాల్సిన విషయం.
ఈ సినిమాకు నరసింహనంది లాంటి దర్శకుడిని సెలెక్ట్ చేసుకోవడం చాలా గొప్ప విషయం. నరసింహ నంది తీసిన మూడు సినిమాలు 1940లో ఒక గ్రామం, కమలతో నా ప్రయాణం, లజ్జ సినిమాలకు జాతీయ అవార్డులు వచ్చాయి. అలాంటి డైరెక్టర్‌ను సెలక్ట్ చేసుకోని జాతీయ రహదారి నిర్మిస్తున్నారు. తెలుగు చిత్రసీమలో ఈరోజు వరకు మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఎందుకంటే తమిళంలో సూర్య నటించిన ఆకాశమే హద్దు రా, మలయాళం లో తీసిన జల్లికట్టు సినిమాలు ఆస్కార్ అవార్డులకు వెళుతున్నట్టు తెలిసింది. అయితే ఆ సినిమాలు వెళ్లినట్లు మన తెలుగు సినిమా ఆ స్థాయికు ఎందుకు వెళ్లడం లేదో నాకు అర్థం కావడం లేదు. మన తెలుగు సినిమాలు కూడా ఆ స్థాయికి వెళ్లేలా మన నిర్మాతలు,ఇండస్ట్రీ పెద్దలు అందరూ ఆ దిశగా అడుగులు వేసేలా శ్రమ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నరసింహ నంది దర్శకత్వంలో రామ సత్యనారాయణ గారు తీస్తున్న 101వ “జాతీయ రహదారి” సినిమా అద్భుతమైన అవార్డులు రావాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని అన్నారు.
Also Read:
మరోసారి టైగర్‌గా రెడీ అవుతున్న బాలీవుడ్ స్టార్ హీరో.. సమ్మర్లో షూటింగ్ స్టార్ట్..