‘దఢక్’ జంట మరోసారి..?

|

Jul 26, 2019 | 3:22 PM

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఇవాళ ఈ మూవీ దక్షిణాది భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. ఇకపోతే ఈ సినిమా హిందీ రైట్స్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోందట. తాజా సమాచారం ప్రకారం హిందీ రీమేక్‌లో విజయ్ పాత్రలో షాహిద్ కపూర్ మేనల్లుడు ఇషాన్ కట్టర్ నటిస్తాడని సమాచారం. హీరోయిన్‌గా జాన్వీ […]

దఢక్ జంట మరోసారి..?
Follow us on

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో దర్శకుడు భరత్ కమ్మ తెరకెక్కించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. ఇవాళ ఈ మూవీ దక్షిణాది భాషల్లో ఏకకాలంలో విడుదలైంది. ఇకపోతే ఈ సినిమా హిందీ రైట్స్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోందట.

తాజా సమాచారం ప్రకారం హిందీ రీమేక్‌లో విజయ్ పాత్రలో షాహిద్ కపూర్ మేనల్లుడు ఇషాన్ కట్టర్ నటిస్తాడని సమాచారం. హీరోయిన్‌గా జాన్వీ కపూర్ కనిపించనుంది. ఇకపోతే ఈ జంట మొదట ‘దఢక్’ అనే సినిమాలో నటించి మెప్పించారు. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. కాగా ఈ చిత్రం ద్వారా మరోమారు ఈ జంట సందడి చేయనుంది.