జేమ్స్‌బాండ్ 25: విడుదల మరింత ఆలస్యం

| Edited By:

Feb 21, 2019 | 7:38 AM

ప్రపంచవ్యాప్తంగా జేమ్స్‌బాండ్ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన 24 చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోగా.. 25వ చిత్రాన్ని తెరకెక్కించాలని నిర్మాతలు అనుకున్నారు. అయితే ప్రారంభమైనప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్‌కు ఏదో ఓ సమస్య ఎదురవుతూనే ఉంది. జేమ్స్‌బాండ్ మూవీలో తొలుత నటించేందుకు డేనియల్ క్రేగ్ ఒప్పుకోలేదు. తరువాత భారీ పారితోషికం ఆఫర్ చేయడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే ఇప్పుడు డైరక్టర్ మారిపోయాడు. దీంతో మూవీ చిత్రీకరణ […]

జేమ్స్‌బాండ్ 25: విడుదల మరింత ఆలస్యం
Follow us on

ప్రపంచవ్యాప్తంగా జేమ్స్‌బాండ్ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు వచ్చిన 24 చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోగా.. 25వ చిత్రాన్ని తెరకెక్కించాలని నిర్మాతలు అనుకున్నారు. అయితే ప్రారంభమైనప్పటి నుంచి ఈ ప్రాజెక్ట్‌కు ఏదో ఓ సమస్య ఎదురవుతూనే ఉంది.

జేమ్స్‌బాండ్ మూవీలో తొలుత నటించేందుకు డేనియల్ క్రేగ్ ఒప్పుకోలేదు. తరువాత భారీ పారితోషికం ఆఫర్ చేయడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే ఇప్పుడు డైరక్టర్ మారిపోయాడు. దీంతో మూవీ చిత్రీకరణ ఆలస్యమైంది. క్యారీ బోజీ దర్శకత్వంలో జేమ్స్‌బాండ్ 25 త్వరలో పట్టాలెక్కనుంది. ఈ చిత్రాన్ని 2019 నవంబర్ కానీ, 2020 ఫిబ్రవరిలో కానీ రిలీజ్ చేయాలనుకోగా.. చిత్రీకరణ ఆలస్యంతో 2020 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్రణాళిక చేశారు.