
Jacqueline Fernandez gift: తమ దగ్గర నమ్మకంగా పనిచేసే వారికి సినీ సెలబ్రిటీలు బహుమతులను ఇవ్వడమన్నది సాధారణంగా చూస్తునే ఉంటాం. ఆ లిస్ట్‌లో బాలీవుడ్ నటి జాక్వలిన్ ఫెర్నాండేజ్ ఎప్పుడో చేరిపోయారు. తన దగ్గర మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేసిన ఓ వ్యక్తికి అప్పట్లో ఈ నటి కారును కానుకగా ఇచ్చారు. తాజాగా తన స్టాఫ్‌లో ఒక వ్యక్తికి ఆమె బ్రాండ్ కారును ఇచ్చారు. హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించినప్పటి ఆ వ్యక్తి జాక్వలిన్‌తో ఉన్నట్లు సమాచారం. కారు తాళాలను అతడికి ఇచ్చిన జాక్వలిన్, పూజా కూడా చేయించారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అందులో జాక్వలిన్ ట్రాఫిక్ పోలీస్ డ్రెస్‌లో కనిపిస్తోంది. కాగా ప్రస్తుతం జాక్వలిన్ అటాక్, భూత్ పోలీస్, కిక్ 2, సర్కస్ చిత్రాల్లో నటిస్తున్నారు.
Read More:
ప్రారంభమైన నాగశౌర్య-అనీష్ కృష్ణ మూవీ
జీవితం ప్రమాదంలో ఉంది, కాపాడండి: సీఎంకు ప్రముఖ దర్శకుడి అభ్యర్థన