Taapsee Pannu : బాలీవుడ్ లో దూసుకుపోతున్న బ్యూటీ.. షారుక్ ఖాన్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న తాప్సీ.?

ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది 'తాప్సీ పన్నూ. ఆతర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది...

Taapsee Pannu : బాలీవుడ్ లో దూసుకుపోతున్న బ్యూటీ.. షారుక్ ఖాన్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న తాప్సీ.?

Updated on: Jan 19, 2021 | 5:47 AM

Taapsee Pannu : ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ‘తాప్సీ పన్నూ. ఆతర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. టాలీవుడ్ లో మంచి ఫామ్ లో ఉండగానే బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ కూడా ఈ అమ్మడు మంచి అవకాశాలను దక్కించుకుంటూ వస్తుంది. ఇటీవల  తాప్సీ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న తాప్సీ కి ఇప్పుడు అదిరిపోయే ఆఫర్ వచ్చిందని బీటౌన్ లో టాక్.

బాలీవుడ్ బాద్షా షారూక్ఖాన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని టాక్. ఈ మేరకు బాలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. రాజ్ కుమార్ హిరాణి – షారూక్ కాంబోలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తాప్సీ హీరోయిన్ గా నటించనుందని సమాచారం. ప్రస్తుతం “రష్మి రాకెట్” అనే మూవీలో నటిస్తోంది తాప్సీ. అథ్లెట్ బ్యాక్ డ్రాప్ లో కొనసాగే ఈ మూవీలో రన్నర్ పాత్ర పోషిస్తోంది. తన గుర్తింపు కోసం పోరాడి అథ్లెట్ గా రాణించిన ఓ రన్నర్ పాత్రను తాప్సీ పోషిస్తోంది.ఆకర్ష్ ఖురానా దర్శకత్వం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి :

‘Ayyappanum Koshiyum’ remake: గురూజీ ఎందుకు వెనక్కి తగ్గారు.. ఫ్యాన్స్ మదిలో అంతుచిక్కని ప్రశ్నలు

Loading...
Unable to load recommendations.
Follow Us