కోటి రూపాయలిచ్చినా రాజకీయ ప్రచారం చేయను

కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు తనను కలిసి తమ పార్టీలో చేరమని కోరారని, అందుకు తాను నిరాకరించానని కోలీవుడ్ నటి ఓవియా అన్నారు. బిగ్‌బాస్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడికి అక్కడ అభిమానగణం చాలా ఉంది. దీంతో ఓవియాను రాజకీయాల్లోకి రావాలని పలు పార్టీ నేతలు సంప్రదించారట. అయితే తనను పార్టీలో చేరమని అడిగిందెవరో చెప్పాలనుకోవడం లేదని ఓవియా చెప్పింది. ఇక కోటిరూపాయలు ఇస్తానంటే రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేస్తారా అని అడిగితే […]

కోటి రూపాయలిచ్చినా రాజకీయ ప్రచారం చేయను
Follow us

| Edited By:

Updated on: Mar 02, 2019 | 10:04 AM

కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు తనను కలిసి తమ పార్టీలో చేరమని కోరారని, అందుకు తాను నిరాకరించానని కోలీవుడ్ నటి ఓవియా అన్నారు. బిగ్‌బాస్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ అమ్మడికి అక్కడ అభిమానగణం చాలా ఉంది. దీంతో ఓవియాను రాజకీయాల్లోకి రావాలని పలు పార్టీ నేతలు సంప్రదించారట. అయితే తనను పార్టీలో చేరమని అడిగిందెవరో చెప్పాలనుకోవడం లేదని ఓవియా చెప్పింది. ఇక కోటిరూపాయలు ఇస్తానంటే రాజకీయ పార్టీ తరఫున ప్రచారం చేస్తారా అని అడిగితే కచ్చితంగా చేయను అంటూ చెప్పుకొచ్చింది. నటిగా కోలీవుడ్‌లో ఒక స్థానాన్ని అందుకోవాలని ఉందని ఆమె తెలిపింది.

కాగా ఓవియా నటించిన ‘90ఎంఎల్’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్‌కు ముందు ఈ చిత్రం ఎన్నో వివాదాల్లో చిక్కుకోంది. ఇందులో ఓవియా మద్యం, పొగతాగడం వంటి సన్నివేశాల్లో నటించడంపై కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేశారు. వీటన్నింటి మధ్య వచ్చిన ఈ చిత్రం వీక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో తదుపరి చిత్రాలపై భారీ ఆశలే పెట్టుకుంది ఓవియా.