ఈ సినిమాలో నేను నటించా..! మీకేమైనా సమస్యా..?

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:28 PM

ప్రముఖ బాలీవుడ్ నటుడు అలోఖ్ నాథ్ ‘మీటూ’ కాన్సెప్ట్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అలోక్ నాథ్ న్యాయ మూర్తి పాత్రలో నటిస్తున్నారు. అయితే.. తాజాగా దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి ఆయన సమాధానమిస్తూ.. అవును నేను ఈ సినిమాలో నటించా.. మీకేమన్నా సమస్య ఉందా..? అయినా.. ప్రస్తుతం నా చేతిలో ఏ సినిమాలు లేవు. నాపై ఆరోపణలు రాకముందే నేను ఈ సినిమా చేశారు. పేద నిర్మాతలకు ఈ […]

ఈ సినిమాలో నేను నటించా..! మీకేమైనా సమస్యా..?
Follow us on

ప్రముఖ బాలీవుడ్ నటుడు అలోఖ్ నాథ్ ‘మీటూ’ కాన్సెప్ట్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అలోక్ నాథ్ న్యాయ మూర్తి పాత్రలో నటిస్తున్నారు. అయితే.. తాజాగా దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి ఆయన సమాధానమిస్తూ.. అవును నేను ఈ సినిమాలో నటించా.. మీకేమన్నా సమస్య ఉందా..? అయినా.. ప్రస్తుతం నా చేతిలో ఏ సినిమాలు లేవు. నాపై ఆరోపణలు రాకముందే నేను ఈ సినిమా చేశారు. పేద నిర్మాతలకు ఈ సినిమాలో.. అండగా ఉండే పాత్ర నాది అంటూ వ్యంగ్యంగా స్పందించారు అలోక్ నాథ్. నిసార్ ఖాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సోనాలి రౌత్, షావర్ అలీ, ఇమ్రాన్ ఖాన్ కీలకపాత్రల్లో నటించారు.

ప్రముఖ రచయిత్రి వింటానందా.. గతంలో అలోక్ పై లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఓ కొలిక్కి రాకముందే అలోక్ ఈ సినిమాలో నటిస్తుండడం చిత్ర పరిశ్రమలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.