బిగ్‌బాస్ బ్యూటీ మాయలో తమిళ తంబీలు!

చెన్నై: ‘బిగ్ బాస్’.. వివాదాలు ఎన్ని ఉన్నా.. వివరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌తో బుల్లితెరలో దూసుకుపోతున్న రియాలిటీ షో. ఈ షో ప్రసారమవుతుంటే చాలామంది టీవీలకు అతుక్కుపోతారు. అలాంటిది ఆ బిగ్‌ బాస్‌లో అందమైన చందమామ కనిపిస్తే ఇంకేమైనా ఉందా.? యువత చూపు తిప్పుకోకుండా.. ఛానల్ మార్చకుండా.. స్కీన్ షార్ట్స్ తీసుకుని మరీ మొబైల్ ఫోన్లను నింపేసుకుంటున్నారు. ఇప్పుడు తమిళనాట ఇదే హాట్ టాపిక్.. ఆ చందమామ ఎవరో కాదు లోస్లియా మారియాసేన్. ఈ బిగ్ బాస్ అందం ఇప్పుడు […]

బిగ్‌బాస్ బ్యూటీ మాయలో తమిళ తంబీలు!

Edited By:

Updated on: Jul 07, 2019 | 10:19 AM

చెన్నై: ‘బిగ్ బాస్’.. వివాదాలు ఎన్ని ఉన్నా.. వివరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌తో బుల్లితెరలో దూసుకుపోతున్న రియాలిటీ షో. ఈ షో ప్రసారమవుతుంటే చాలామంది టీవీలకు అతుక్కుపోతారు. అలాంటిది ఆ బిగ్‌ బాస్‌లో అందమైన చందమామ కనిపిస్తే ఇంకేమైనా ఉందా.? యువత చూపు తిప్పుకోకుండా.. ఛానల్ మార్చకుండా.. స్కీన్ షార్ట్స్ తీసుకుని మరీ మొబైల్ ఫోన్లను నింపేసుకుంటున్నారు. ఇప్పుడు తమిళనాట ఇదే హాట్ టాపిక్.. ఆ చందమామ ఎవరో కాదు లోస్లియా మారియాసేన్. ఈ బిగ్ బాస్ అందం ఇప్పుడు తమిళనాడులో సంచలనం. తమిళ తంబీల మనసు దోచుకున్న ఈ సుందరాంగీ చెన్నై సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.

లోస్లియా శ్రీలంకలోని మోడల్‌గా, ఓ ఛానల్‌లో న్యూస్ రీడర్‌గా వర్క్ చేస్తోంది. సినిమాల్లో ప్రయత్నిస్తూ మోడల్‌గా ఎదుగుతున్న ఈమెకు బిగ్ బాస్ అవకాశం దక్కింది. ఇక ఇప్పుడు ఈ షోలో ఆమె చేసే సందడికి జనాలు ఫిదా అవుతున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈమె పేరు మీద అనేక ఆర్మీలు కూడా రెడీ అయ్యాయి. ఆమె కోసం పెద్ద ఎత్తున ఓట్లు వేయడానికి తమిళ తంబీలు సిద్ధమైపోయారు.

గత సీజన్‌లో ఓవియాకు వచ్చిన పాపులారిటీ కంటే ఎక్కువగానే లోస్లియాకు ఈ సీజన్‌లో వస్తుందని యూనిట్ భావిస్తోంది. మొత్తానికి షోకి సెంటర్ అఫ్ అట్రాక్షన్‌గా నిలిచిన లోస్లియా మున్ముందు ఎలాంటి సంచలనాలకు కేర్ అఫ్ అడ్రెస్ అవుతుందో వేచి చూడాలి.

అటు తెలుగు బిగ్ బాస్ గత సీజన్‌లో కౌశల్‌కు భారీ క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈసారి తెలుగు ప్రజలు ఏ పార్టిసిపెంట్‌కు నీరాజనాలు పలుకుతారో వేచి చూడాలి. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించబోతున్న బిగ్ బాస్ సీజన్ 3 ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది.