Hollywood Star Caught In A Lie: ఒక చిన్న అబద్ధంతో ట్విట్టర్ లో మీమ్స్ గా మారిన హాలీవుడ్ స్టార్.. మరి ఆ అబద్ధం ఏమిటో తెలుసా..!

లీవుడ్ సెలబ్రెటీ డకోటా జాన్సన్ ఫన్నీ మీమ్స్ తో ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది. ఆమె చెప్పిన ఒక అబద్ధం ప్రస్తుతం సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది. ఆమె అమాయక చూపుతో పాటు అబద్ధాలు చెబుతుంది అంటూ సరదాగా..

Hollywood Star Caught In A Lie: ఒక చిన్న అబద్ధంతో ట్విట్టర్ లో మీమ్స్ గా మారిన హాలీవుడ్ స్టార్.. మరి ఆ అబద్ధం ఏమిటో తెలుసా..!

Updated on: Jan 26, 2021 | 3:57 PM

Hollywood Star Caught In A Lie:  హాలీవుడ్ సెలబ్రెటీ డకోటా జాన్సన్ ఫన్నీ మీమ్స్ తో ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది. ఆమె చెప్పిన ఒక అబద్ధం ప్రస్తుతం సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తోంది. ఆమె అమాయక చూపుతో పాటు అబద్ధాలు చెబుతుంది అంటూ సరదాగా నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

అనుకోకుండా ఒకొక్కసారి చేసి చిన్న చిన్న పొరపాటు మీమ్ ఫెస్ట్ గా మారుతుంది. ఇలా గతంలో చాలా మంది సెలబ్రిటీలు బాధితులయ్యారు. తాజాగా డకోటా జాన్సన్. ట్విట్టర్ లో మీమ్స్ బాధితురాలుగా మారారు. అసలు డకోటా మీమ్స్ గా మారడం వెనుక కథ ఏమిటంటే..

చాలా కాలం క్రితం, డకోటా తన ఇల్లు అమ్మే సమయంలో ఇంటి ఆర్కిటెక్చర్ ను వీడియోలో చూపించింది. ఆమె తన ఇళ్ళు పని తీరుని వివరిస్తూ.. వంట గదిలో ఉన్న నిమ్మకాయలను చూపిస్తూ.. నేను నిమ్మకాయలను ప్రేమిస్తున్నాను.. వాటికి నా ఇంట్లో మంచి స్థానముంది అంటూ నిమ్మకాయల మీద ప్రేమ అంటూ పాట కూడా పాడింది. అయితే ఇటీవల జిమ్మీ ఫాలన్ తో కలిసి ది టునైట్ షోలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో డకోటా తనకు అసలు నిమ్మకాయ అంటే ఇష్టం ఉండదని.. తెలిపింది. వాస్తవానికి, తనకు నిమ్మకాయ అంటే అలెర్జీ అని చెప్పింది. పుచ్చకాయ, నిమ్మకాయలు తాను తినని తింటే నాలుక దురద వస్తుందని తెలిపింది డకోటా. అయితే గతంలో తన ఇల్లుని అభిమానులకు పరిచయం చేస్తున్న సమయంలో వంట గదిలో నిమ్మకాయలున్నట్లు తెలియదని.. అప్పటి సందర్భాన్ని బట్టి అలా చెప్పాల్సి వచ్చిందని తెలిపింది.

అప్పుడు చెప్పిన చిన్న అబద్ధం ప్రేక్షకులు గుర్తు పెట్టుకున్నారు.. దీంతో నెటిజన్లు డకోటా అప్పుడు ఇప్పుడు అంటూ అభిమానులతో సహా అందరూ ఫన్నీ మీమ్స్ పోస్టు చేస్తూ సందడి చేస్తున్నారు. దీంతో సెలబ్రెటీలు ఏమైనా చెప్పేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని.. లేదంటే ప్రస్తుత రోజుల్లో వాటిని అభిమానులు గుర్తు పెట్టుకుని దొరికితే ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తారని అంటున్నారు.

Also Read:  ఇలాంటి సీఎంను ఎక్కడా చూడలేదు.. ఉద్యోగులపై సుప్రీంకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలకు జగన్ బాధ్యుడన్న చంద్రబాబు

Loading...
Unable to load recommendations.
Follow Us