నాగార్జునతో భారీ హిట్‌ కొట్టిన ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా..!

సినిమా ఇండస్ట్రీలో ఎవరి రాత ఎలా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేరు. వీరు బాగా రాణిస్తారనుకున్నా వారు ఉన్నట్లుండి ఫేడౌడ్ అవుతారు.

నాగార్జునతో భారీ హిట్‌ కొట్టిన ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా..!

Updated on: May 15, 2020 | 6:11 PM

సినిమా ఇండస్ట్రీలో ఎవరి రాత ఎలా ఉంటుందో ఎవ్వరూ ఊహించలేరు. వీరు బాగా రాణిస్తారనుకున్నా వారు ఉన్నట్లుండి ఫేడౌడ్ అవుతారు. వీరి పని అయిపోయినట్లే అనుకున్న వారు.. ఉవ్వెత్తున కెరటంలా లేస్తారు. మరికొంతమంది ఒక్క సినిమాతోనే సరిపెట్టుకుంటుంటారు. దీన్నంతా పక్కనపెడితే.. గిరిజా షెట్టర్‌ ఈ పేరు వింటేనే లెజండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన గీతాంజలి మన మనసులో మెదులుతుంది.

Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం

మొదటి సినిమా అయినా ఈ మూవీలో అద్భుతంగా నటించి ప్రేక్షకులు ఎప్పటికీ తనను గుర్తుపెట్టుకునేలా క్రేజ్‌ సంపాదించుకుంది గిరిజా. ఆ తరువాత మరో ఐదు చిత్రాల్లో నటించిన ఈ హీరోయిన్‌.. అనూహ్యంగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ప్రస్తుతం లండన్‌లో రచయితగా, జర్నలిస్ట్‌గా, ఫిలాసఫర్‌గా గిరిజా రాణిస్తోంది. కాగా ఈ నెల 10న గీతాంజలి విడుదలై 31 సంవత్సరాలు పూర్తైన సందర్బంగా.. అప్పటి కొన్ని పేపర్‌ క్లిప్పింగ్స్‌ను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. మెమోరీస్ అంటూ ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోలు, పేపర్ క్లిప్పింగ్స్‌పై ఫ్యాన్స్ పలు కామెంట్లు పెడుతున్నారు. మీ నటన ఎప్పటికీ మర్చిపోలేమంటూ వారు తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం

Read This Story Also: నిర్మలా సీతారామన్ ప్రెస్‌మీట్: ఏపీ మిర్చి రైతులకు ఊరట

Loading...
Unable to load recommendations.
Follow Us