తొలిసారి కొడుకుతో కలిసి నటించనున్న ‘పెళ్ళి సందడి’ హీరో.. సక్సెస్‏ఫుల్ డైరెక్టర్ పర్యవేక్షణలో షూటింగ్

|

Dec 09, 2020 | 11:54 AM

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నిర్మించిన పెళ్ళి సందడి థియేటర్లలో భారీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. తక్కువ బడ్జెట్‏తో ఈ సినిమాను

తొలిసారి కొడుకుతో కలిసి నటించనున్న పెళ్ళి సందడి హీరో.. సక్సెస్‏ఫుల్ డైరెక్టర్ పర్యవేక్షణలో షూటింగ్
Follow us on

Tollywood News: దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నిర్మించిన ‘పెళ్ళి సందడి’ థియేటర్లలో భారీ హిట్ సాధించిన విషయం తెలిసిందే. తక్కువ బడ్జెట్‏తో ఈ సినిమాను చిత్రీకరించినా.. బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. అంతేకాకుండా ఈ మూవీ హీరో శ్రీకాంత్ కెరీర్లోనే అతి పెద్ద హిట్ మూవీగా నిలిచిపోయింది. అయితే ఇప్పుడు అదే టైటిల్‏తో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా రాఘవేంద్ర రావు మరో సినిమాను తీస్తున్నట్లు ప్రకటించారు.

రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ఈ సినిమాను కొత్త దర్శకురాలు గౌరి రోనక్ చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం ఈ కథకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి తాజాగా ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో ఆయన కనిపించనున్నారని టాక్. అయితే దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ హీరోయిన్ కోసం వెతుకుతోంది. కాగా ఈ సినిమా షూటింగ్ జనవరి నుంచి ప్రారంభంకానుంది.