Hero Ram Charan: ‘ఉప్పెన’ టీజర్ పై స్పందించిన రామ్ చరణ్.. సో బ్యూటీఫుల్ అంటూ ట్వీట్..

|

Jan 16, 2021 | 9:40 AM

యువ హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఉప్పెన'. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తవగా.. విడుదలకు సిద్ధంగా ఉన్న సమయంలో

Hero Ram Charan: ఉప్పెన టీజర్ పై స్పందించిన రామ్ చరణ్.. సో బ్యూటీఫుల్ అంటూ ట్వీట్..
Follow us on

యువ హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘ఉప్పెన’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తవగా.. విడుదలకు సిద్ధంగా ఉన్న సమయంలో లాక్‏డౌన్ ఎఫెక్ట్‏తో వాయిదా పడింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే ఇందులోని పాటలను సూపర్ హిట్ సాధించాయి. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల థియేటర్లు తిరిగి తెరుచుకోవడంతో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రబృందం. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్‏కు విశేషస్పందన లభించింది. భావోద్వేగపూరితమైన మాటలు, క్లాసికల్ పాటలు, ఆకట్టుకునే విజువల్స్ అన్ని కలిసి ప్రేక్షకులకు మంచి అభిప్రాయాన్ని కలిగించాయి. దీంతో సెలబ్రెటీలు సైతం ఈ టీజర్ పై తమ దైన శైలిలో స్పందిస్తున్నారు.

తాజాగా ఈ మూవీ టీజర్ పై హీరో రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా స్పంధించారు. “ఉప్పెన టీజర్ చాలా అందంగా ఉంది. మై బ్రదర్ పంజా వైష్ణవ్ తేజ్ మరియు కృతిశెట్టిల జోడి చాలా ఫ్రెష్‏గా ఉండి. చిత్ర యూనిట్ మొత్తానికి నా అభినందనలు” అంటూ ట్వీట్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. కాగా వచ్చే నెల ఫిబ్రవరిలో ఈ మూవీ విడుదల కానుంది. ఇక తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో నటించారు.

రామ్ చరణ్ ట్వీట్..

Also Read: