రూ.10 కోట్లు తిరస్కరించిన ముద్దుగుమ్మ

|

Aug 19, 2019 | 4:32 PM

తాము తయారు చేసే వస్తువులను మార్కెట్ చేసుకునేందుకు రకరకాల యాడ్స్ ఇస్తుంటారు వ్యాపారులు. ఇందుకోసం సెలబ్రిటీలను ఎంచుకుంటారు. హీరో, హీరోయిన్స్, స్పోర్ట్స్ స్టార్స్ కు కోట్ల రూపాయలు ఆఫర్ చేసి మరీ తమ ప్రోడక్ట్స్ కు పబ్లిసిటీ కల్పిస్తారు. ఐతే ఓ ముద్డుగుమ్మ మాత్రం యాడ్ నచ్చలేదన్న కారణంగా కోట్ల రూపాయలను వదిలేసింది. తాను నమ్మని దాని గురించి అసత్య ప్రచారం చేయలేనని ఏకంగా 10 కోట్ల డీల్ కు నో చెప్పింది. ఇంతకీ అంత డబ్బును […]

రూ.10 కోట్లు తిరస్కరించిన ముద్దుగుమ్మ
Follow us on

తాము తయారు చేసే వస్తువులను మార్కెట్ చేసుకునేందుకు రకరకాల యాడ్స్ ఇస్తుంటారు వ్యాపారులు. ఇందుకోసం సెలబ్రిటీలను ఎంచుకుంటారు. హీరో, హీరోయిన్స్, స్పోర్ట్స్ స్టార్స్ కు కోట్ల రూపాయలు ఆఫర్ చేసి మరీ తమ ప్రోడక్ట్స్ కు పబ్లిసిటీ కల్పిస్తారు. ఐతే ఓ ముద్డుగుమ్మ మాత్రం యాడ్ నచ్చలేదన్న కారణంగా కోట్ల రూపాయలను వదిలేసింది. తాను నమ్మని దాని గురించి అసత్య ప్రచారం చేయలేనని ఏకంగా 10 కోట్ల డీల్ కు నో చెప్పింది. ఇంతకీ అంత డబ్బును కాదన్న ఆ సుందరి ఎవరా అనుకుంటున్నారా..బాలీవుడ్ స్లిమ్ బ్యూటీ శిల్పాశెట్టి.

ఓ ప్రముఖ ఆయుర్వేద కంపెనీ..ఫిట్ నెస్ కు సంబంధించిన ఓ పిల్ యాడ్ లో నటించాలని శిల్పాశెట్టిని సంప్రదించింది. అందుకోసం 10 కోట్ల రూపాయలిస్తామని ఆఫర్ చేసింది. ఐతే స్లిమ్మింగ్ పిల్స్ వాడితే బరువు తగ్గరని..సరైన ఆహారం, వ్యాయామాల ద్వారానే ఫిట్ నెస్ వస్తుందని 10కోట్ల రూపాయల ఆఫర్ ను తిరస్కరించింది ఈ నాజూకు భామ. సహజంగా బరువు తగ్గితేనే ఆరోగ్యంగా ఉంటారని తెలిపింది. తాను నమ్మని వాటిని చెప్పి ప్రజలను మోసం చేయలేనని..స్లిమ్మింగ్ పిల్స్ వాడటం వలనో..కడుపు మాడ్చుకోవడం వలనో బరువు తగ్గరని అంటోంది.