నా ‘డీఎన్‌ఏ’లోనే తప్పు జరిగింది‌.. అందుకే ఆమెతో బ్రేకప్ అయ్యింది

ఉత్తరాది వాడు అయినప్పటికీ ఇక్కడి సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు హర్షవర్ధన్ రాణే

నా డీఎన్‌ఏలోనే తప్పు జరిగింది‌.. అందుకే ఆమెతో బ్రేకప్ అయ్యింది

Updated on: Oct 30, 2020 | 1:22 PM

Harshvardhan Rane breakup: ఉత్తరాది వాడు అయినప్పటికీ ఇక్కడి సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు హర్షవర్ధన్ రాణే. ఇటీవలే ఈ నటుడికి కరోనా సోకగా.. తాజాగా కోలుకున్నారు. ఇదిలా ఉంటే హర్షవర్ధన్, నటి కిమ్‌ శర్మతో ఒకప్పుడు రిలేషన్‌లో ఉండగా.. తరువాత వారిద్దరు విడిపోయారు. అయితే బ్రేకప్ గురించి ఈ జంట ఇంతవరకు స్పందించలేదు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో కిమ్‌తో బ్రేకప్‌ విషయాన్ని బయటపెట్టారు హర్ష. (ప్రతి యాక్షన్‌కి రియాక్షన్ ఉంటుంది: భూమా కుటుంబంపై ఎమ్మెల్యే ఫైర్‌)

ఇందులో దాచడానికి ఏం లేదు. మేము కొన్నాళ్లపాటు కలిసే ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ బంధం ముగిసిపోయింది అని రాణే వెల్లడించారు. తన వ్యవహారశైలి, ఆలోచనా విధానమే ఆమె నుంచి నన్ను దూరం చేశాడని ఈ నటుడు చెప్పుకొచ్చారు. కిమ్‌తో గడిపిన సమయం జీవితంలో అత్యంత మధుర ఙ్ఞాపకాలను మిగిల్చింది, తనకు చాలా హాస్యచతురత ఉంది. నాకు తెలిసి నా డీఎన్‌ఏలోనే ఏదో తప్పు జరిగింది. ఏ కారణం లేకుండా ఎవరూ విడిపోరు. 12 ఏళ్ల పాటు నేను ఒంటరిగానే ఉన్నాను అని రాణే వివరించారు. కాగా తెలుగులో ఖడ్గం, మగధీర వంటి చిత్రాల్లో నటించిన కిమ్‌ శర్మ.. 2010లో వ్యాపారవేత్త అలీ పుంజానీని పెళ్లాడింది. అతడితో విడిపోయిన తరువాత హర్షవర్ధన్‌తో ఆమె డేటింగ్ చేశారు. (ఊబర్‌ స్టైలిష్‌ లుక్‌లో అదరగొట్టేస్తున్న కమల్‌)

Loading...
Unable to load recommendations.
Follow Us