HBD Nithiin: అదరగొట్టేస్తోన్న నితిన్ ‘రంగ్‌దే’ మోషన్ పోస్టర్..!

వెంకీ అట్లూరీ దర్శకత్వంలో నితిన్ నటిస్తోన్న చిత్రం 'రంగ్‌దే'. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ మొదటిసారిగా నితిన్‌తో జతకట్టింది.

HBD Nithiin: అదరగొట్టేస్తోన్న నితిన్ రంగ్‌దే మోషన్ పోస్టర్..!

Updated on: Mar 29, 2020 | 5:06 PM

వెంకీ అట్లూరీ దర్శకత్వంలో నితిన్ నటిస్తోన్న చిత్రం ‘రంగ్‌దే’. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ మొదటిసారిగా నితిన్‌తో జతకట్టింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. సోమవారం నితిన్ పుట్టినరోజు సందర్బంగా ఈ మూవీ నుంచి ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. అందులో నితిన్, కీర్తి రొమాంటిక్‌ లుక్‌లో కనిపించారు. అర్జున్, అను పాత్రల్లో వీరిద్దరు కనిపించనుండగా.. మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు దేవీ అందించిన సంగీతం మెయిన్ అస్సెట్‌గా నిలిచింది. కాగా ఈ సినిమాను మొదట మేలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ కరోనా నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఏడాది భీష్మతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నితిన్.. ఈ మూవీతో ఆ సక్సెస్‌ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నారు.

Read This Story Also: అనుష్కనా..? సమంతనా..? ఆ బయోపిక్‌లో ఎవరు..?

Loading...
Unable to load recommendations.
Follow Us