
ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ నటిస్తున్న కొత్త చిత్రం ‘గుణ 369’. నూతన దర్శకుడు అర్జున్ జంధ్యాల తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్ టెలీ ఫిలింస్ బ్యానర్లపై అనిల్ కడియాల, తిరుమల రెడ్డి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే రిలీజైన ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది.
ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని ఆగష్టు 2న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. తమిళ బ్యూటీ అనగ ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది.