Godzilla vs. Kong : హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఇక గాడ్జిల్లా సినిమా ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్న విషయం కూడా తెలిసిందే. ఇప్పడు మరోసారి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సారి కింగ్ కాంగ్ తో కలిసి వస్తుంది గాడ్జిల్లా. గాడ్జిల్లా vs కాంగ్ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా మార్చి 26న థియేటర్లలో రిలీజ్ కానుంది. అద్బుతమైన విజువల్ వండర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా కు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రయూనిట్.
కింగ్ కాంగ్ గత సినిమాలో చనిపోయిందని చూపించారు. కానీ ఊహించని విధంగా అది బ్రతికింది ఆతర్వాత గాడ్జిల్లా మనుషులపై దాడి చేస్తున్న సమయంలో కాంగ్ గాడ్జిల్లాతో పోరాడుతుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. అంతే కాకుండా కాంగ్ ఓ చిన్న పాపతో కనెక్ట్ అవ్వడం చూపించారు. సినిమాలో గాడ్జిల్లా కాంగ్ లమధ్య ఫైట్ సీన్స్ వేరే లెవల్ లో ఉండబోతున్నాయని తెలుస్తుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్న యంగ్ హీరో.. కొత్త సినిమాలో 60 ఏళ్ల వృద్దుడిగా కనిపించనున్న నితిన్