Zombie Reddy Movie: జాంబీ రెడ్డి సినిమా నుంచి ‘గో కరోనా’ సాంగ్ రిలీజ్.. ఇంట్లోనే ఉండమంటే ఊరుకుంటమా అంటూ..

|

Jan 16, 2021 | 12:58 PM

తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‏గా నటించిన తేజ సజ్జ హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'జాంబీరెడ్డి'. భారత్ తొలి జాంబీ మూవీగా తెరకెక్కుతున్న

Zombie Reddy Movie: జాంబీ రెడ్డి సినిమా నుంచి గో కరోనా సాంగ్ రిలీజ్.. ఇంట్లోనే ఉండమంటే ఊరుకుంటమా అంటూ..
Follow us on

తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‏గా నటించిన తేజ సజ్జ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘జాంబీరెడ్డి’. భారత్ తొలి జాంబీ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ఆనంది, దక్ష నగార్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నండగా.. వచ్చే నెల ఫిబ్రవరి 5న ఈ మూవీ విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ బైట్, బిగ్ బైట్‏తో సినిమాపై అంచనాలను పెంచేశారు. తాజాగా ఈ చిత్రంలోని గో కరోనా పాటను విడుదల చేసింది చిత్రబృందం.

ఇంట్లోనే ఉండమంటే ఊరకుంటమా.. రోడ్లన్నీ ఖాళీగా ఉంటే రాక ఉంటమా.. ఎవడెన్ని చెప్తా ఉన్నా మేము వింటమా.. మా వీపు పగిలే వరకు మానుకుంటమా అంటూ ఈ పాట సాగింది. దీనికి మార్క్ కె రాబిన్ ట్యూన్ అందించగా.. లాక్ డౌన్ సమయంలో జరిగిన ఇన్సిడెన్స్ ఆధారంగా ఈ పాటను చిత్రీకరించనట్లుగా కనిపిస్తోంది. దీనికి మామా సింగ్ లిరిక్స్ అందించడంతోపాటు ర్యాప్ కూడా పాడారు. అంతేకాకుండా ప్రేక్షులను గో కరోనా సాంగ్ బాగా ఆకట్టుకుంది. ఆపిల్ ట్రీ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read:

Mail Movie Review: ప్రేక్షకుల మనసును హత్తుకుంటున్న ‘మెయిల్’.. కామెడి టైమింగ్‏తో అదరగొట్టిన ప్రియదర్శి..

Uppena Movie Teaser: ‘ఉప్పెన’ టీజర్ రివ్యూ: ”ఈ ఒక్క రాత్రీ.. 80 సంవత్సరాలు గుర్తిండిపోయేలా బ్రతికేద్దాం..”