ఫిలింఫేర్-2019: ‘రంగస్థలం’, ‘మహానటి’లకు అవార్డుల పంట

| Edited By:

Dec 22, 2019 | 11:48 AM

దక్షిణాదికి సంబంధించిన 66వ ఫిలింఫేర్ అవార్డు వేడుక సంబరాలు శనివారం చెన్నైలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంకు చెందిన సినీ ప్రముఖులు హాజరయ్యారు. రెజీనా, సందీప్ కిషన్‌లు వ్యాఖ్యతలుగా వ్యవహరించారు. ఇక తెలుగులో రంగస్థలం, మహానటి చిత్రాలకు ఈ ఏడాది అత్యధిక అవార్డులు వరించాయి. ఉత్తమ నటుడిగా రామ్ చరణ్(రంగస్థలం), నటిగా కీర్తి సురేష్(మహానటి) అవార్డులను అందుకున్నారు. అవార్డు విజేతలు వీరే: ఉత్తమ చిత్రం: మహానటి ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్(మహానటి) […]

ఫిలింఫేర్-2019: రంగస్థలం, మహానటిలకు అవార్డుల పంట
Follow us on

దక్షిణాదికి సంబంధించిన 66వ ఫిలింఫేర్ అవార్డు వేడుక సంబరాలు శనివారం చెన్నైలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంకు చెందిన సినీ ప్రముఖులు హాజరయ్యారు. రెజీనా, సందీప్ కిషన్‌లు వ్యాఖ్యతలుగా వ్యవహరించారు. ఇక తెలుగులో రంగస్థలం, మహానటి చిత్రాలకు ఈ ఏడాది అత్యధిక అవార్డులు వరించాయి. ఉత్తమ నటుడిగా రామ్ చరణ్(రంగస్థలం), నటిగా కీర్తి సురేష్(మహానటి) అవార్డులను అందుకున్నారు.

అవార్డు విజేతలు వీరే:
ఉత్తమ చిత్రం: మహానటి
ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్(మహానటి)
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవీ శ్రీ ప్రసాద్(రంగస్థలం)
ఉత్తమ నటుడు(క్రిటిక్స్): దుల్కర్ సల్మాన్(మహానటి)
ఉత్తమ నటి(క్రిటిక్స్): రష్మిక మందన్నా(గీతా గోవిందం)
ఉత్తమ సహాయనటుడు: జగపతి బాబు(అరవింద సమేత వీర రాఘవ)
ఉత్తమ సహాయనటి: అనసూయ(రంగస్థలం)
ఉత్తమ పాటల రచయిత: చంద్రబోస్(ఎంత సక్కగున్నావే: రంగస్థలం)
ఉత్తమ నేపథ్య గాయకుడు: సిద్ శ్రీరామ్(గీతా గోవిందం)
ఉత్తమ నేపథ్య గాయకురాలు: శ్రేయా ఘోషల్(మందార మందార: భాగమతి)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: రత్నవేలు(రంగస్థలం)