Master Movie : నష్టాలను భర్తీ చేయాలని కోరుతున్న ‘మాస్టర్’ మూవీ డిస్టిబ్యూటర్లు.. నిర్మాతలు ఏమంటున్నారంటే

|

Jan 29, 2021 | 7:45 AM

దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమా తెలుగులో పర్వాలేదు అనిపించుకున్నా తమిళ్ లో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. లోకేష్ కానగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో..

Master Movie : నష్టాలను భర్తీ చేయాలని కోరుతున్న మాస్టర్ మూవీ డిస్టిబ్యూటర్లు.. నిర్మాతలు ఏమంటున్నారంటే
Follow us on

Master Movie : దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమా తెలుగులో పర్వాలేదు అనిపించుకున్నా తమిళ్ లో సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. లోకేష్ కానగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు. ఇక ఈ సినిమా కలక్షన్ల పరంగాను బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. రెండు వారాల గ్యాప్ తోనే ఓటీటీలో స్ట్రీమ్ కాబోతోందీ చిత్రం. ఈ నెల 28న ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మాస్టర్ స్ట్రీమింగ్  అయ్యింది. అయితే విదులైన రెండు వారాల్లోనే డిజిటల్ లో స్ట్రీమింగ్ చేస్తే థియేటర్స్ కు ప్రేక్షకులను  వస్తారని డిస్టిబ్యూటర్స్ గగ్గోలు పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో డిస్టిబ్యూటర్స్ నిర్మాతలతో భేటీ అయ్యారు. సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసాయడంతో తమకు నష్టాలు వాటిల్లుతాయని కావున నష్టాలను భర్తీ చేయడానికి ఓటీటీ ప్రాఫిట్ లో 10 శాతం తమకు చెల్లించాలని కోరారు. అయితే సినిమా 17 వరోజు నుండి వచ్చే లాభాల్లో మొత్తం వాటాను తీసుకోవాలని ఎగ్జిబిటర్లకు చిత్ర నిర్మాతల్లో ఒకరైన లలిత్ కుమార్ తెలిపారని తెలుస్తుంది. దీనిపై డిస్టిబ్యూటర్స్ ఎలా స్పందిస్తారన్నది తెలియాల్సి ఉంది. సంక్రాతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 225 కోట్ల రూపాయలు వసూలు చేసిందని తెలుస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Rana Daggubati : పవర్ స్టార్‌‌‌‌‌‌‌తో పోటీకి సిద్దమైన రానా.. సెట్లోకి అడుగు పెట్టిన దగ్గుబాటివారబ్బాయి..