21 ఏళ్ల హీరోయిన్.. 56 ఏళ్ల హీరో.. 28 రోజుల్లో షూటింగ్ కంప్లీట్.. కట్ చేస్తే, కలెక్షన్ల సునామీ..

నటసార్వభౌమ ఎన్టీఆర్ నటించిన 'డ్రైవర్ రాముడు' చిత్రం విడుదలై 46 ఏళ్లు పూర్తి చేసుకుంది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో కేవలం 28 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ బ్లాక్‌బస్టర్ సినిమా ఎన్టీఆర్ సినీ చరిత్రలో మైలురాయి. 35 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉన్నా.. ఎన్టీఆర్, జయసుధల కెమిస్ట్రీ, అద్భుతమైన పాటలు, బాక్సాఫీస్ రికార్డులతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది.

21 ఏళ్ల హీరోయిన్.. 56 ఏళ్ల హీరో.. 28 రోజుల్లో షూటింగ్ కంప్లీట్.. కట్ చేస్తే, కలెక్షన్ల సునామీ..
Ntr's 'driver Ramudu Movie

Updated on: Apr 27, 2026 | 10:16 AM

మహానటుడు, నటసార్వభౌమ దివంగత నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్).. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రేక్షకులను అలరించడంతోపాటు.. రాజకీయాల్లో సైతం రాణించారు. అయితే.. తెలుగు సినీ చరిత్రలో నటసార్వభౌమ ఎన్టీఆర్ నటించిన అద్భుతమైన చిత్రాలలో ‘డ్రైవర్ రాముడు’ ఒకటి. 1979 ఫిబ్రవరి 2న విడుదలైన ఈ చిత్రం.. 46 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయినప్పటికీ.. ఈ చిత్రం క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఎల్లప్పుడూ ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, జయసుధ, సారథి, కైకాల సత్యనారాయణ తదితరులు నటించగా.. కె. చక్రవర్తి సంగీతం అందించాడు. విలన్లుగా రావు గోపాలరావు, మోహన్ బాబు తండ్రీకొడుకుల పాత్రల్లో మెప్పించారు.

28 రోజుల్లో సృష్టించిన అద్భుతం..

వాస్తవానికి డ్రైవర్ రాముడు.. 28 రోజుల్లో సృష్టించిన అద్భుతం.. అప్పటి యంగ్ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కేవలం 28 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎన్టీఆర్ పట్టుదలతో కేవలం మూడు షెడ్యూల్స్ లోనే ఈ సినిమాను పూర్తి చేయడం విశేషం. షూటింగ్ కోసం రోడ్డు సౌకర్యం లేని ప్రాంతాలకు ఎన్టీఆర్ స్వయంగా రోడ్లు వేయించి మరీ షూటింగ్ జరిపించడం విశేషం..

వయసు వ్యత్యాసం – ఆన్ స్క్రీన్ మ్యాజిక్:

ఈ సినిమా చేసే సమయానికి ఎన్టీఆర్ వయసు 56 ఏళ్లు కాగా, హీరోయిన్ జయసుధ వయసు ఆయన కంటే 35 ఏళ్లు చిన్నది. అంటే.. ఆమె వయస్సు 21 మాత్రమే.. అయినప్పటికీ, వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ, డ్యూయెట్లు – రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి అందించిన పాటలు సినిమా విజయానికి వెన్నెముకగా నిలిచాయి. “గుగ్గు గుడుసుంది”, “మామిళ్ల తోపుకాడ” వంటి పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తాయి. జంధ్యాల రాసిన పవర్ ఫుల్ డైలాగ్స్ సినిమాకు మరో హైలైట్ గా నిలిచాయి.

లారీ డ్రైవర్‌గా జీవితం ప్రారంభించి.. స్వయంకృషితో లారీ ఓనర్ స్థాయికి ఎదిగే పాత్రలో జీవించిన ఎన్టీఆర్ చిత్రం.. అప్పట్లోనే బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. తిరుపతి, విజయవాడ వంటి కేంద్రాల్లో 25 వారాల పాటు (సిల్వర్ జూబ్లీ) ఆడి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. తమిళంలో శివాజీ గణేషన్ తో ‘లారీ డ్రైవర్ రాజకన్ను’గా, హిందీలో మిథున్ చక్రవర్తితో ‘టర్కీబ్’గా ఈ సినిమా రీమేక్ అయ్యి అక్కడ కూడా ఘనవిజయం సాధించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us