Thandav Controversy: తాండవ్ వెబ్ సిరీస్‌కు కొనసాగుతున్న నిరసనల సెగ.. బిహార్‌లో గాడిదలతో నిరసన వ్యక్తం..

|

Jan 22, 2021 | 12:17 PM

Thandav Controversy: తాండవ్ వెబ్ సరీస్‌పై నిరసనల సెగ ఇంకా కొనసాగుతూనే ఉంది. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో

Thandav Controversy: తాండవ్ వెబ్ సిరీస్‌కు కొనసాగుతున్న నిరసనల సెగ.. బిహార్‌లో గాడిదలతో నిరసన వ్యక్తం..
Follow us on

Thandav Controversy: తాండవ్ వెబ్ సరీస్‌పై నిరసనల సెగ ఇంకా కొనసాగుతూనే ఉంది. సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో హిందూ దేవుళ్లను కించపరిచేలా సన్నివేశాలు చిత్రీకరించారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. అంతేకాకుండా పలు పోలీస్ స్టేషన్‌లలో కేసులు కూడా నమోదు చేశారు. జ‌నవరి 15న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన తాండవ్ వెబ్ సిరీస్‌లో డింపుల్‌ కపాడియా, మహ్మద్‌ జీషన్‌ అయూబ్‌ ఇతర కీలక పాత్రల్లో నటించారు. డైరెక్టర్‌ అలీ అబ్బాస్‌ జాఫర్‌ సినిమాను తెరకెక్కించగా ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించారు.

కాగా చిత్రయూనిట్ తప్పు ఒప్పుకొని క్షమాప‌ణ‌లు చెప్పడంతో పాటు మ‌నోభావాల‌ను దెబ్బతీసే స‌న్నివేశాలు తొల‌గించిన‌ప్పటికి తాండ‌వ్‌కు నిర‌స‌నల సెగ ఆగ‌డం లేదు. తాజాగా చిరాగ్ పాశ్వాన్ లోక్ జ‌న్‌శ‌క్తి పార్టీ (ఎల్‌జేపీ) పాట్నాలో గాడిద‌ల‌తో నిర‌స‌న చేప‌ట్టారు. తాండ‌వ్ చిత్ర ద‌ర్శకుడు అలీ అబ్బాస్ జాఫ‌ర్, ప్రధాన పాత్ర దారుడు సైఫ్ అలీఖాన్ ఫొటోల‌ను గాడిద మెడ‌లో వేసి దానిపై దేశ ద్రోహి, హిందూ విరోధి అని రాసి ఊరేగించారు. తాండ‌వ్ వెబ్ సిరీస్ స‌మాజంలో విభ‌జ‌న సృష్టిస్తుంద‌ని వారు ఆరోపించారు. రీసెంట్‌గా ముంబై పోలీసులు కూడా తాండవ్ చిత్ర బృందంతో పాటు అమెజాన్‌పై కేసు న‌మోదు చేశారు.

మరో వివాదంలో కంగనా రనౌత్.. తన పరువుకు భంగం కలిగించిందని కేసు వేసిన బాలీవుడ్ సినీ గేయ రచయిత జావేద్అక్తర్..