Tollywood: డాక్టర్ టు యాక్టర్.. తొలి‌ ప్రయత్నం లోనే వరించిన నంది అవార్డ్

| Edited By: Balu Jajala

Apr 02, 2024 | 4:11 PM

మనసుపెట్టి నేర్చుకుంటే రాని విద్య అంటూ ఏదీ లేదని నిరూపించారు నిర్మల్ కు చెందిన వైద్యుడు వేణుగోపాల కృష్ణ. వృత్తిరీత్యా ఆయన డాక్టర్. కానీ ఎన్నాళ్ళ నుంచో యాక్టర్ కావాలని కలలు కన్నాడు.. ఆ కల ఇన్నాళ్లకు కూతురి సహకారంతో నెరవేరడం.. అందులోను తొలి ప్రయత్నం‌లోనే విజయం సాధించి శభాష్ అనిపించుకోవడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Tollywood: డాక్టర్ టు యాక్టర్.. తొలి‌ ప్రయత్నం లోనే వరించిన నంది అవార్డ్
Docotr Venugopal
Follow us on

మనసుపెట్టి నేర్చుకుంటే రాని విద్య అంటూ ఏదీ లేదని నిరూపించారు నిర్మల్ కు చెందిన వైద్యుడు వేణుగోపాల కృష్ణ. వృత్తిరీత్యా ఆయన డాక్టర్. కానీ ఎన్నాళ్ళ నుంచో యాక్టర్ కావాలని కలలు కన్నాడు.. ఆ కల ఇన్నాళ్లకు కూతురి సహకారంతో నెరవేరడం.. అందులోను తొలి ప్రయత్నం‌లోనే విజయం సాధించి శభాష్ అనిపించుకోవడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎలాంటి ముందస్తు అనుభవం లేకపోయినా.. మనసుపెట్టి ప్రయత్నం చేసి విజయం సాధించారు డాక్టర్ వేణుగోపాల్. డాక్టర్ వేణుగోపాల్ నిర్మించిన ప్రేమతో నాన్న అనే లఘు చిత్రానికి రాష్ట్రవ్యాప్తంగా మూడు నంది పురస్కారాలు లభించాయి. స్వీయ దర్శకత్వంలో వేణుగోపాల కృష్ణ నిర్మించిన ఈ చిత్రం లో ఆయనతో పాటు ఆయన కుమార్తె సుహాసిని నటించారు.

ఓ తండ్రి తన పిల్లల కోసం పడే ఆవేదన తన పిల్లలకు ఇచ్చే మంచి సందేశం ఆధారంగా కథను సిద్ధం చేసుకుని ప్రేమతో నాన్న అనే లఘు చిత్రాన్ని రూపొందించారు. దీనికిగాను ఉత్తమ లఘు చిత్రం ఉత్తమ దర్శకత్వం ఉత్తమ నటి విభాగాలలో మూడు నంది పురస్కారాలకు ఎంపిక కావడం విశేషం. తాను రూపొందించిన లఘు చిత్రం ఉత్తమ సందేశాత్మక చిత్రంగా ఎంపిక కావడం పట్ల ఆనందంగా ఉందని, తొలి చిత్రంతోనే మూడు నంది పురస్కాలను అందుకోవడం చాలా సంతోషానిచ్చిందని తెలిపారు డాక్టర్ వేణుగోపాలకృష్ణ.

నిర్మల్ పట్టణానికి చెందిన వేణుగోపాల కృష్ణ వృత్తిరీత్యా వైద్యుడు. జిల్లా ఆసుపత్రిలో ఆర్ఎంఓగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం నిజామాబాద్ వైద్య కళాశాలలో ఎండి బయోకెమిస్ట్రీ విద్యనభ్యసిస్తున్నారు. తన కూతురు సుహాసిని కూడా డాక్టరే.. తాను ఎంబిబిఎస్ చదువుతుందో.. ఇద్దరిది ఒకే కల.. డాక్టర్ తో పాటు యాక్టర్లుగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని. ఆ కలను ఇద్దరు కలిసి ప్రేమతో నాన్న లఘు చిత్రంతో తొలి ప్రయత్నం లోనే నెరవేర్చుకోవడంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.