యంగ్ డైరెక్టర్స్‏కు సూచనలిచ్చిన దర్శకధీరుడు.. సెట్‏లో ఎలా ఉండాలో చెప్పిన రాజమౌళి..

|

Dec 30, 2020 | 8:19 AM

ప్రభాస్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో నటించిన బహుబలి సినిమా సూపర్ హిట్‏గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఆల్ ఇండియా స్టార్ డైరెక్టర్‏గా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి.

యంగ్ డైరెక్టర్స్‏కు సూచనలిచ్చిన దర్శకధీరుడు.. సెట్‏లో ఎలా ఉండాలో చెప్పిన రాజమౌళి..
rajamouli
Follow us on

ప్రభాస్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో నటించిన బహుబలి సినిమా సూపర్ హిట్‏గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఆల్ ఇండియా స్టార్ డైరెక్టర్‏గా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజమౌళి. అప్పుడప్పుడు నూతన దర్శకులు, ఫిల్మ్ మేకర్స్ కోసం ఆయన కొన్ని సలహాలు ఇస్తూ ఉంటాడు. తాజాగా షూటింగ్ స్పాట్‏లో ఎలా ఉండాలి, నటీనటులో ఎలా మసులుకోవాలి అని విషయాను షేర్ చేసుకున్నాడు. ఒక సినిమా చిత్రీకరించేటప్పుడు దాదాపు నటీనటులకు, దర్శకులకు మధ్య కొన్ని విబేధాలు వస్తుంటాయి. కానీ రాజమౌళిక విషయంలో మాత్రం ఎప్పుడూ అలాంటి సందర్భం రాలేదు. కాగా తన అనుభవాలను కొన్ని షేర్ చేసుకున్నాడు.

సెట్‏లో ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మంచిగా ఉండేందుకు ప్రయత్నించాలని చెప్పారు. అదేవిధంగా సెట్‏లో ప్రతి ఒక్కరిలో కూడా పని పట్ల శ్రద్ద ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. మన చుట్టు ఉన్న వారితో బాగా ఉన్న సమయంలోనే మంచి సినిమా అనేది రూపొందుతుంది. సినిమా చిత్రీకరణ ప్రదేశంలో ప్రశాంతత లేకపోతే ఆ సినిమా ఫలితం ఖచ్చితంగా తేడా వస్తుందని తెలిపారు. సెట్‏లో ఎప్పుడు అంతా మంచిగానే ఉండేందుకు కొన్ని సందర్బాల్లో కొన్నింటిని వదిలేయాల్సి వస్తుంది. సినిమా షూటింగ్‏కు అందరూ సహకరించడం వలన మంచి సినిమా రూపొందుతుందని తన అనుభవాలను యంగ్ దర్శకులకు సూచనలు ఇచ్చారు రాజమౌళి.