‘అయ్యప్పనుమ్‌ కోషియం’ రీమేక్‌లో పవన్‌.. డైరెక్టర్ ఎవరంటే

| Edited By:

Aug 18, 2020 | 1:49 PM

మలయాళంలో ఘన విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియంను తెలుగులో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే.

అయ్యప్పనుమ్‌ కోషియం రీమేక్‌లో పవన్‌.. డైరెక్టర్ ఎవరంటే
Follow us on

Ayyappanum Koshiyum telugu remake: మలయాళంలో ఘన విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియంను తెలుగులో రీమేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ ఈ మూవీ రీమేక్ రైట్స్‌ని సొంతం చేసుకోగా.. ఇందులో ఎవరు నటించబోతున్నారన్న చర్చ ఇప్పటికీ ఫిలింనగర్ వర్గాల్లో నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పేరు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. ఈ రీమేక్‌కి పవన్ ఓకే చెప్పారని సమాచారం. ఇక త్రివిక్రమ్‌ సమర్పణలో హారిక అండ్ హాసిని ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే తొలి ప్రేమ, రంగ్‌ దే దర్శకుడు వెంకీ అట్లూరీ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించబోతున్నట్లు టాక్.

అంతేకాదు ఇందులో మరో పాత్ర కోసం తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతిని సంప్రదిస్తున్నట్లు టాక్‌. ఒకవేళ ఆయన ఓకే చెప్తే.. ఈ ప్రాజెక్ట్‌కి మరింత ఎంటర్‌టైన్‌మెంట్ యాడ్ అవ్వనుంది. ఇక ఈ మూవీకి సంబంధించిన వివరాలను పవన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2న అధికారికంగా ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే పవన్‌ ఫ్యాన్స్‌కి నిజంగా శుభవార్తే.

Read More:

వీటికి ఆమిర్ వివరణ ఇవ్వాలి: కంగనా

నా పక్కన కనిపించిన ప్రతి వ్యక్తితో నాకు లింక్ పెట్టారు